Asianet News TeluguAsianet News Telugu

మత్తుమందు ఇచ్చి మైనర్ బాలికపై అత్యాచారం.. సహకరించిన తల్లి కూడా అరెస్ట్..  

కోల్‌కతాలో మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినందుకు తల్లీకొడుకులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Mother son duo arrested for drugging, raping minor girl in Kolkata
Author
First Published Dec 18, 2022, 12:38 PM IST

దేశంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. రోజురోజుకు అత్యాచార, హత్య ఘటనలు పెరుగుతున్నాయి. కామాంధులు తమ కామావాంఛ తీర్చుకునేందుకు బాలికలు, మహిళపై అనే తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. దేశంలో పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకుని వచ్చినా .. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వాస్తవానికి ఈ తరహా ఘటనలు కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. చాలామంది పరువు పోతుందని బయటకు రాకుండా సైలెంట్ ఉండిపోతున్నారు. 

తాజాగా కోల్‌కతాలో సమాజం సిగ్గుతో తల దించుకునే ఘటన దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాజంలో ఏది మంచి, ఏది చెడు, తప్పేంటీ.. ఒప్పేంటో వివరణంగా చెప్పాల్సిన కన్న తల్లే.. కొడుకుతో దారుణానికి ఒడికట్టింది. తాను కూడా ఓ మహిళనేనన్న ఇంగితం మరిచింది. ఓ మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి..తన కొడుకుతో ఆ బాలికపై అత్యాచారం చేయించింది. 

ఈ దారుణ ఘటన కోల్‌కతాలోని హరిదేవ్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన రెండు నెలల క్రితమే జరిగింది. అయితే ముందుగా బాలిక పోలీసులకు చెప్పేందుకు భయపడింది. అయితే స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో ఇటీవల బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు తల్లీకొడుకులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి, నిందితురాలు ఒకే సంస్థలో బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో  అక్టోబర్‌లో ఆ బాలికను తన ఇంటికి రావాలని నిందితురాలు ఆహ్వానించింది. నిందితురాలి ఆహ్వానం మేరకు బాలిక ఆమె ఇంటికి వెళ్లింది. పథకం ప్రకారం.. మందు కలిపిన ఆహారం ఇచ్చింది. దీంతో బాలిక స్పృహ కోల్పోయింది.

ఆ తర్వాత నిందితురాలి కుమారుడు బాలికపై  రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారి తెలిపారు. ప్రాణాలతో బయటపడిన యువతి మొదట్లో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడానికి భయపడింది. కానీ తర్వాత, ఆమె స్నేహితుల ప్రోత్సాహంతో.. పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసుకున్నారు. తల్లీకొడుకులను అరెస్టు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios