ఎవరీ రాకూడని కష్టం ఆ తల్లికి వచ్చింది. అనారోగ్యంతో బిడ్డ చనిపోతే.. కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేవు. దీంతో... బిడ్డ శవాన్ని ఒడిలో పెట్టుకొని బొమ్మలు విక్రయించింది. ఒడిశాలోని కటక్ లో జరిగిన ఈ సంఘటన అందరి హృదయాలను పిండేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బక్షిబజార్ కు చెందిన భారతికి ముగ్గురు కుమార్తెలు. భర్త సుభాష్ నాయక్  కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో... భారతి బజారులో బొమ్మలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా.. ఇటీవల భారతి చిన్న కుమార్తెకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆ చిన్నారి చనిపోయింది. చనిపోయిన చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు. దాంతో కొన్ని బొమ్మలు విక్రయించి వచ్చే డబ్బుతో అంత్యక్రియలు నిర్వహించాలని భావించింది.

కాగా ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. వెంటనే వారు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో అధికారులు వచ్చి ఆ బిడ్డ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మిగిలిన ఇద్దరు చిన్నారులను స్థానిక ఆశ్రమానికి తరలించారు.