Asianet News TeluguAsianet News Telugu

కోడలి కోసం రెండు గాజులు అమ్మిన అత్త.. ఛీ కొట్టినా చేరదీసింది..

వృద్ధాప్యంలో అత్తను చూడాల్సిన కోడలు నిత్యం వేదించింది. చివరకు వృద్ధాశ్రమంలో చేర్పించి కానీ కుదుటపడలేదు. ఒక్కగానొక్క కొడుకు తనకు దూరమయ్యేసరికి ఆ ముసలిప్రాణం తట్టుకోలేకపోయింది. ఇంత చేసినా కోడలి మీద కోపం రాలేదు ఆ అత్తకు.. ఆమె ప్రాణాపాయంలో ఉందంటే తన గాజులు, దిద్దులు అమ్మి మరీ కొడుక్కి డబ్బులిచ్చింది. ఈ ఘటన యూపీలోని గోరఖ్‌పూర్ లో జరిగింది.  

mother in law sold her jewelry for daughter in law who sent her old age home - bsb
Author
Hyderabad, First Published Dec 26, 2020, 12:37 PM IST

వృద్ధాప్యంలో అత్తను చూడాల్సిన కోడలు నిత్యం వేదించింది. చివరకు వృద్ధాశ్రమంలో చేర్పించి కానీ కుదుటపడలేదు. ఒక్కగానొక్క కొడుకు తనకు దూరమయ్యేసరికి ఆ ముసలిప్రాణం తట్టుకోలేకపోయింది. ఇంత చేసినా కోడలి మీద కోపం రాలేదు ఆ అత్తకు.. ఆమె ప్రాణాపాయంలో ఉందంటే తన గాజులు, దిద్దులు అమ్మి మరీ కొడుక్కి డబ్బులిచ్చింది. ఈ ఘటన యూపీలోని గోరఖ్‌పూర్ లో జరిగింది.  

గోరఖ్ పూర్ లోని 67 ఏళ్ల బృంద భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని గుట్టుగా నడిపింది. ఉన్న ఏకైక కుమారునికి వివాహం జరిపించింది. భర్త బతికున్నంత కాలం ఆమె జీవితం సవ్యంగానే సాగింది. ఆ తరువాత కోడలు అత్తను వేధించడం ప్రారంభించింది. 
అటు భార్యకు చెప్పలేక, ఇటు తల్లిని సముదాయించలేక బృంద కుమారుడు నలిగిపోయేవాడు. అయితే ఇంతలో తల్లి అనారోగ్యం పాలయ్యింది. ఈ నేపధ్యంలో భార్య పోరు మరింత ఎక్కువ కావడంతో భర్త తన తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అక్కడ చేరినా  తన కుమారుడు, కోడలు గురించి తపించిపోయేది. రచూ ఫోన్ చేసి వారితో మాట్లాడుతుండేదని, కుమారుని నుంచి ఫోన్ రాకపోతే తెగ బాధపడేదని వృద్ధాశ్రమ నిర్వాహకుడు ఎన్ఎన్ మౌర్య తెలిపారు.

కొడుకు అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నా, కోడలు మాత్రం ఒక్కసారి కూడా వచ్చి అత్తను పరామర్శించిందే లేదట. అయితే ఏమయిందో తెలియదు కానీ ఉన్నట్టుండి కోడలు అనారోగ్యంపాలైంది.  కొడుకు ద్వారా ఈ విషయం బృందకు తెలిసింది. 

కోడలికి ఆపరేషన్ చేయాల్సి ఉందని, అందుకు మూడు లక్షల రూపాయలు ఖర్చవుతాయని కొడుకు ద్వారా తెలిసింది. తరువాత బృంద ఒక్క నిమిషం కూడా ఆగలేదు వెంటనే కొడుకును వృద్ధాశ్రమానికి పిలిపించి, ఏమాత్రం ఆలోచించకుండా తన చేతికి ఉన్న రెండు బంగారు గాజులను, చెవులకు ఉన్నదుద్దులు తీసి కుమారునికి ఇచ్చింది. 

వాటి విలువ లక్ష రూపాయలకు పైగానే ఉంటుందని, వాటిని అమ్మి కోడలుకు వైద్యం చేయించాలని కుమారుడికి చెప్పింది. ఈ దృశ్యాన్ని చూసినవారంతా ఆ తల్లి నిష్కల్మష మనసును చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఏ కోడలైతే తనను ఛీకొట్టిందో ఆమెకే ప్రాణాలు పోసేందుకు ముందుకు వచ్చిన అత్తను వృద్ధాశ్రమ నిర్వాహకులు, స్థానికులు అభినందిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios