Asianet News TeluguAsianet News Telugu

ఇలాంటి అత్తలు కూడా ఉంటారా..? కన్నతల్లే పొమ్మంది.. కిడ్నీ దానం చేసి కోడలికి ప్రాణదానం

కోడల్ని రాచీరంపానా పెట్టే అత్తగార్ల గురించి వార్తల్లో వింటూ వుంటాం. అదనపు కట్నం కోసమో.. పిల్లలు పుట్టడం లేదనో కోడళ్లను పుట్టింటికి పంపి.. కొడుకుకు వేరే పెళ్లి చేసే అత్తలను చూశాం

mother in law donated her kidney to daughter in law
Author
Rajasthan, First Published Oct 1, 2018, 1:26 PM IST

కోడల్ని రాచీరంపానా పెట్టే అత్తగార్ల గురించి వార్తల్లో వింటూ వుంటాం. అదనపు కట్నం కోసమో.. పిల్లలు పుట్టడం లేదనో కోడళ్లను పుట్టింటికి పంపి.. కొడుకుకు వేరే పెళ్లి చేసే అత్తలను చూశాం. కానీ వీరందరికీ భిన్నంగా కోడలి ప్రాణం నిలబెట్టింది ఒక అత్తగారు.

రాజస్థాన్ బాడ్మేర్‌‌కు చెందిన సోనికా దేవికి పెళ్లయ్యింది.. అయితే ఆమె గత కొంతకాలంగా మెడికేషన్ సపోర్ట్‌తో జీవిస్తోంది. ఈ సమయంలో వైద్యులు ఆమెకు కిడ్నీట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని సూచించారు.

అయితే సోనికాకు కిడ్నీ దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.. స్వయంగా సోనికా కన్న తల్లి, సోదరుడు కూడా నిరాకరించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సోనికా అత్తగారు గోనీదేవి తన కిడ్నీ దానం చేయడానికి సమ్మతించారు. దీంతో వైద్యులు విజయవంతంగా కిడ్నీని ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. దీంతో సోనికా తిరిగి మామూలు మనిషి కాగలిగింది. కిడ్నీ దానం చేసి కోడలి ప్రాణాలు కాపాడిన గోనీదేవిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios