తాజాగా ఓ తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇది పాత వీడియోనే కావచ్చు కానీ... చూసిన ప్రతిసారీ... ఎరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది.
ఈ ప్రపంచంలో గొప్ప ప్రేమ ఏది అంటే ఎవరైనా ముందు తల్లి ప్రేమ అనే చెబుతారు. ఎందుకంటే... తల్లి ప్రేమ నిస్వార్థమైనది. తన కడుపు నిండకపోయినా.. తన బిడ్డ ల కడుపు నిండాలని తల్లి తాపత్రయపడుతుంది. అంతేకాదు.. తన ప్రాణాలు పోతున్నా.. వాటిని పణంగా పెట్టి మరీ తన బిడ్డను కాపాడాలని చూస్తుంది. తాజాగా ఓ తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇది పాత వీడియోనే కావచ్చు కానీ... చూసిన ప్రతిసారీ... ఎరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది.
ఈ వీడియోని ఐఏఎస్ అధికారి డాక్టర్ సుమితా మిశ్రా ని షేర్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే..ఓ తల్లి కోడి భారీ వర్షం నుంచి తన పిల్లలను కాపాడటానికి ప్రయత్నిస్తోంది. తన రెక్కల కింద బిడ్డలను దాచిపెట్టింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 99వేల వ్యూస్ రావడం గమనార్హం.
ఆ భారీ వర్షంలో తాను తడుస్తున్నా.. తన బిడ్డలు తడవకుండా ఉండేందుకు అది చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. అమ్మ ఎప్పటికీ అమ్మే అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
