తన బేబీకి రోడ్డు ఎలా క్రాస్ చేయాలో నేర్పిస్తున్న ఏనుగు.. వీడియో వైరల్
అందులో ఏనుగు.. తన బేబీ కి రోడ్డు ఎలా క్రాస్ చేయాలో నేర్పిస్తూ ఉండటం గమనార్హం. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ప్రతి తల్లిదండ్రులు..తమ పిల్లలకు ఎలా ఉండాలి..? ఏం చేయాలి..? ఇలా ప్రతి విషయాన్ని నేర్పిస్తూ ఉంటారు. అది మనకు తెలుసు. కానీ... జంతువులు కూడా... తమ పిల్లలకు నేర్పిస్తూ చూడటం చాలా స్పెషల్ గా అనిపిస్తూ ఉంటుంది. తాజాగా...... సోషల్ మీడియాలో ఓ ఏనుగు కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఏనుగు.. తన బేబీ కి రోడ్డు ఎలా క్రాస్ చేయాలో నేర్పిస్తూ ఉండటం గమనార్హం. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోని ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు షేర్ చేశారు. ఈ వీడియోలో తల్లి ఏనుగు... తన పిల్ల ఏనుగు కి.... అడవిలోకి ఎలా వెళ్లాలి..? రోడ్డు ని క్రాస్ చేయాలి అనే విషయాన్ని నేర్పిస్తూ కనిపిస్తోంది. తల్లి ఏనుగు తెలివికి నెటిజన్లు ఇంప్రెస్ అయిపోతున్నారు.
పోస్ట్‌ను 24.6 వేల వ్యూస్ వచ్చాయి. ఇక కామెంట్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కామెంట్ల వర్షం కురుస్తోంది. అడవిలో జంతువులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు అటవీ ప్రాంతాలలో ఎలా జాగ్రత్తగా నడపాలి అనే దాని గురించి వ్రాసారు. మరికొందరు కారు డ్రైవరు డ్రైవింగ్ సమయంలో సకాలంలో పాజ్ చేసి తల్లి, బిడ్డను రోడ్డు దాటడానికి అనుమతించారని ప్రశంసించారు.