బిడ్డ చనిపోవడంతో బీభత్సం సృష్టించిన తల్లిఏనుగు.. ఇద్దరు మృతి, పలు ఇల్లు ధ్వంసం..
తన బిడ్డ చనిపోవడంతో ఓ తల్లి ఏనుగు బీభత్సంగా మారింది. ఇద్దరు వ్యక్తులను చంపేసింది. మృతుల కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిహారం ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్ జిల్లాలో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. బుధవారం ఓ ఆడ ఏనుగు చేసిన దాడిలో ఇద్దరు వృద్ధులు మరణించారు. తన బిడ్డ మృతి చెందడంతో ఆగ్రహం చెందిన ఏనుగు ఈ దాడికి పాల్పడిందని అటవీ అధికారి తెలిపారు. కోపంతో ఆ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆ ఏనుగు నయాగ్రామ్‌లోని చందాబిలా అటవీ శ్రేణిలోని ప్రసిద్ధ రామేశ్వరాలయం దగ్గర్లోని ఖాళీగా ఉన్న బస్సు, మోటార్ సైకిల్ లతోపాటు అనేక ఇళ్లను కూడా ధ్వంసం చేసింది.
ఏనుగు దాడిలో మృతి చెందిన వారికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరు వ్యక్తుల మృతి సంతాపం తెలిపారు. మృతులు ఇద్దరూ 60 ఏళ్లకు పైబడ్డవారే. వృద్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్లను ప్రభుత్వం బాగు చేయిస్తుందని హామీ ఇచ్చారు.
జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులను పట్టించిన పచ్చబొట్టు, వైర్ లెస్ సెట్...
చనిపోయిన గున్నఏనుగు మృతదేహాన్ని చూసేందుకు అక్కడికి వెళ్లిన వ్యక్తులపై తల్లి ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను నేలపై పడిపోగా, తొక్కి చంపినట్లు అధికారి తెలిపారు. మృతులను నయాగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్యూల్బర్ గ్రామానికి చెందిన అనంత జన (60), బిరిబారియాకు చెందిన శషధర్ (60) మహాతగా గుర్తించారు.
“చందబిలా అటవీ ప్రాంతంలో చనిపోయిన గున్న ఏనుగును చూసేందుకు కొందరు వెళ్లగా, ఏనుగు వారిపై దాడి చేసింది. వారిలో ఇద్దరు వృద్ధులు మినహా చాలామంది పారిపోయారు. ఇద్దరు ఏనుగు దాడిలో మృతి చెందారు' అని ఖరగ్‌పూర్ డీఎఫ్‌వో శివానందరామ్ తెలిపారు. చనిపోయిన బిడ్డకు కాపలాగా ఉన్న తల్లి ఏనుగు మనుషుల్ని చూసి హింసాత్మకంగా మారింది. దాడికి దిగింది. దీంతో ఇద్దరిని చంపేసింది. పలు ఇళ్లను ధ్వంసం చేయడం బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు.
అటవీ శాఖ సిబ్బంది తల్లి ఏనుగును అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ తెలిపారు. ఝర్‌గ్రామ్, సమీప జిల్లాలలో ఏనుగుల దాడి సంఘటన నమోదవడం గత కొద్దికాలంలో ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు 40 మందితో కూడిన అటవీ సిబ్బంది బృందాన్ని అక్కడ మోహరించారు.