మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కాళ్లు, చేతులకు ఆరు వేళ్లతో పుట్టిన బిడ్డకు అలా ఉండటం అరిష్టమని భావించిన తల్లి కొడవలితో అదనంగా ఉన్న వేళ్లను కోసేయడంతో చిన్నారి మరణించింది. వివరాల్లోకి వెళితే.. ఖండ్వా జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన తారాబాయి అనే మహిళకు ఈ నెల 22న చిన్నారి జన్మించింది.

బిడ్డ పుట్టిందని అయితే ఆ పాప కాళ్లు, చేతులకు ఆరేసి వేళ్లు ఉండటంతో కలత చెందింది.. అలా ఉండటం వల్ల ఆమెకు పెళ్లయ్యాక పెళ్లి కాదని భావించింది.  అంతే వెంటనే ఇంట్లో ఉన్న కొడవలి తీసుకుని అదనపు వేళ్లను కేసేసింది.

గాయాలపై ఆవు పేడ పూసింది.. ఆ తర్వాత కాసేపటికే తీవ్ర రక్త స్రావం కారణంగా చిన్నారి మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అదనపు వేళ్లు కారణంగా పెద్దయ్యాక పెళ్లి కాదేమోనన్న భయంతోనే తల్లి ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. పుట్టుకతో వచ్చిన శారీరక అసాధరణత కారణంగా మనుషుల్లో, జంతువుల్లో బహుళ అంగుళీకత వస్తుందని వైద్యులు తెలిపారు.