కళ్లల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సిన ఓ తల్లి.. కన్న కొడుకు పట్ల దారుణంగా ప్రవర్తించింది. కన్న కొడుకు పై ఓ తల్లి లైంగిక దాడికి పాల్పడింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళ రాష్ట్రానికి చెందిన వక్కాం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కన్న కొడుకును లైంగికంగా వేధించింది. కాగా.. ఆమె అలా తన 14ఏళ్ల కొడుకును లైంగిక వేధిండం ఆమె భర్తకు తెలిసింది. వెంటనే చైల్డ్ లైన్ కి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు వెంటనే చైల్డ్  వెల్ఫేర్ కమిటీ స్పందించింది. అనంతరం  సదరు మహిళను అరెస్టు చేశారు.

ప్రస్తుతం సదరు మహిళను రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కొడుకును లైంగిక వేధించిన కేసులో ఓ తల్లిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి అని స్థానిక పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.