విడాకులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేమ వివాహాల నుంచి విడాకులు తీసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ: విడాకులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేమ వివాహాల నుంచి విడాకులు తీసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టుగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. వివరాలు.. వివాహ వివాదం కారణంగా తలెత్తిన ఓ బదిలీ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఈ వివావాహం ప్రేమ వివాహమని కేసులో న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘‘చాలా విడాకులు ప్రేమ వివాహాల నుంచి మాత్రమే ఉత్పన్నమవుతున్నాయి’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ధర్మాసనం.. మధ్యవర్తితత్వాన్ని ప్రతిపాదించింది. అయితే దానిని భర్త వ్యతిరేకించారు. అయితే, ఇటీవలి తీర్పును దృష్టిలో ఉంచుకుని.. అతని అనుమతి లేకుండా విడాకులు మంజూరు చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. తదనంతరం.. ధర్మాసనం మధ్యవర్తిత్వానికి పిలుపునిచ్చింది.
