భారత ప్రధాని మోదీ మరోసారి ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఘనత సాధించారు. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేతలకున్న పాపులారిటీపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా ప్రధాని మోదీ పాపులారిటీ లిస్ట్‌లో తొలిస్థానంలో నిలిచారు.
భారత ప్రధాని మోదీ మరోసారి వర్డల్ నెంబర్ వన్ లీడర్‌గా నిలిచారు. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఘనత సాధించారు. అత్యంత ప్రజా ఆమోదం ఉన్న దేశాధినేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో ఉన్నట్లు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వెల్లడించింది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల అధినేతలు కూడా ప్రధాని మోదీ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీకి సానుకూలంగా 75 శాతం మంది, వ్యతిరేకంగా 25 శాతం మంది స్పందించడం విశేషం. ఈ సర్వేలో 22 మంది ప్రపంచ నాయకులపై ఓటింగ్ నిర్వహించారు. ప్రధాని మోదీ తర్వాత.. 63 శాతం ప్రజామోదంతో మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ డో స్థానంలో నిలిచారు. 54 శాతంతో రేటింగ్ తో ఇటలీ ప్రధాని మారియో డ్రాగి మూడో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 41 శాతం అప్రూవల్ రేటింగ్‌తో 5వ స్థానంలో నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా 38 శాతం ఆమోదం రేటింగ్‌తో బిడెన్ తర్వాత స్థానంలో నిలిచారు.
అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఈ సంస్థ ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, జర్మనీ, ఇండియా, మెక్సికో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో సర్వేను నిర్వహించింది.
2022 జనవరిలో కూడా ప్రధాని మోదీ నంబర్ 1
అంతకుముందు జనవరి 2022లో నిర్వహించిన సర్వేలోనూ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ ప్లాట్‌ఫారమ్ రాజకీయ ఎన్నికలు, ఎన్నికైన అధికారులు, ఓటింగ్ సమస్యలపై నిజ-సమయ పోలింగ్ డేటాను అందిస్తుంది. మార్నింగ్ కన్సల్ట్ ప్రతిరోజూ 20,000 గ్లోబల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.
సర్వేలో ప్రతి దేశంలో వయస్సు, లింగం, ప్రాంతం మరియు కొన్ని దేశాలలో అధికారిక ప్రభుత్వ వనరులను పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే కొన్ని దేశాల్లో విద్యా విచ్ఛిన్నం ప్రభుత్వ వనరులపై ఆధారపడి ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్‌లో జాతి ఆధారంగా కూడా ర్యాంక్ చేయబడ్డాయి. ప్రతివాదులు తమ దేశాలకు తగిన భాషల్లో ఈ సర్వేలను పూర్తి చేస్తారు. భారతదేశం నుండి తీసుకున్న నమూనాలో జనాభాలోని అక్షరాస్యత భాగం చేర్చబడింది.
