Asianet News TeluguAsianet News Telugu

కేరళకు మరిన్ని సహాయక బృందాలు

వరదలతో అతలాకుతలం అవుతోన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సహాయక బృందాలను పంపింది. ఇండియన్‌ ఆర్మీకి చెందిన 5 మెడికల్‌ టీంలు, 2 కాలమ్‌లు, 2 అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్లు, 2 చేతక్‌ హెలికాఫ్టర్‌లు సహాయంగా పంపించింది

more assistance to kerala from centre
Author
Kerala, First Published Aug 19, 2018, 6:53 PM IST

ఢిల్లీ: వరదలతో అతలాకుతలం అవుతోన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సహాయక బృందాలను పంపింది. ఇండియన్‌ ఆర్మీకి చెందిన 5 మెడికల్‌ టీంలు, 2 కాలమ్‌లు, 2 అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్లు, 2 చేతక్‌ హెలికాఫ్టర్‌లు సహాయంగా పంపించింది. సహాయక చర్యలకు వాతావరణం అనుకూలంగా ఉండటంతో మరింత ముమ్మరం చేసే దిశగా కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

ఇప్పటికే భారత రక్షణ శాఖ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వీరితోపాటు ఇండియన్‌ నేవీ నుంచి 10 రెస్క్యూ టీంలు, 10 మోటారు బోటులు, ఒక అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్‌, మరొక సీకింగ్‌ హెలికాఫ్టర్‌లు పంపారు. ఇండిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి రెండు ఎంఐ-17 హెలికాఫ్టర్లు, ఒక అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్‌లు పంపారు. 

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నుంచి 6 మోటారు బోట్లు, 4 సాధారణ బోట్లు, 21 హైర్డ్‌ బోట్లులు పంపించారు. అలాగే ఐసీజీఎస్‌ విజిత్‌ నౌక ద్వారా 40 టన్నుల సహాయక సామగ్రి పంపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios