ఆయుష్షు పెంచాల్సిన అన్నం మెతుకు ఆ చిన్నారి పాలిట మృత్యువుగా మారింది. గొంతుదిగితే ఆకలిని చంపేసే అన్నం మెతుకు.. గొంతులో ఇరుక్కుని ఆ చిన్నారినే చిదిమేసింది.
ఆయుష్షు పెంచాల్సిన అన్నం మెతుకు ఆ చిన్నారి పాలిట మృత్యువుగా మారింది. గొంతుదిగితే ఆకలిని చంపేసే అన్నం మెతుకు.. గొంతులో ఇరుక్కుని ఆ చిన్నారినే చిదిమేసింది.
కర్ణాటకలోని పావగడలో గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని 9 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకాలోని రాజవంతి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజప్ప, భారతి దంపతులకు సత్య అనే తొమ్మిది నెలల బాబు ఉన్నారు. ఆదివారం ఉదయం భారతి వంట చేస్తుంది. బాబు అక్కడే వంటింట్లో ఆడుకుంటున్నాడు.
ఆడుకుంటూ పక్కనే ఉన్న గిన్నెలోని అన్నం తినేందుకు ప్రయత్నించాడు. అన్నమే కదా అని భారతి కూడా వదిలేసింది. ఇంతలో ఓ అన్నం మెతుకు సత్య గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరి ఆడక ఏడ్వటం ప్రారంభించాడు.
వెంటనే విషయం అర్థమైన భారతి చిన్నారిని తీసుకుని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఆ సమయంలో చిన్న పిల్లల వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో వైద్యం చేసేందుకు ఇంకెవరూ ముందుకు రాలేదు. దీంతో ఊపిరి ఆడక ఏడ్చీ, ఏడ్జీ బాబు మృత్యువాత పడ్డాడు.
