monsoon: రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీని కారణంగా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Heavy Rainfall: పంజాబ్ లోని చాలా ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఒక్కసారిగా పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ అధికారులు.. విపత్తు నిర్వహణ పడవలను రంగంలోకి దింపి.. వర్షపు నీటితో నిండిపోయిన డేరా బస్సీ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షంతో జనావాసాలు చెరువులుగా మారడం, పడవలు నడవటానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీని కారణంగా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో చండీగఢ్ లో 322 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంజాబ్ లోని డేరా బస్సీలోని నివాస సముదాయం గుల్ మొహర్ సిటీ ఎక్స్ టెన్షన్ లోకి నీరు చేరడంతో ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి పడవలను ఉపయోగించాల్సి వచ్చింది.
అలాగే, వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో శని, ఆదివారాల్లో భారీ వర్షం కురిసింది, ఢిల్లీ 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఆదివారం 8:30తో ముగిసిన 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది 1982 తర్వాత జూలైలో ఒకే రోజులో అత్యధిక వర్షపాతమని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. పాశ్చాత్య భంగం, రుతుపవనాల మధ్య పరస్పర చర్య వాయువ్య భారతదేశంలో తీవ్రమైన వర్షపాతానికి దారి తీస్తోందనీ, సీజన్‌లో మొదటిసారి చాలా భారీ వర్షపాతాన్ని ఢిల్లీ చవిచూసిందని తెలిపింది. గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో వేర్వేరు వర్షాలకు సంబంధించిన ప్రమాదాల్లో ఐదారుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఆకస్మిక వరదలను చూశాయి.
