ఒకప్పుడు యాత్రాస్థలాల్లో మాత్రమే కోతులు కనిపించేవి. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ, గుంపులు గుంపులుగా కోతులు దర్శనమిస్తాయి. కాస్త ఆదమరిచామా.. ఇంటిమీద దాడిచేసి ఆహారపదార్థాలన్నీ ఖాళీ చేసి.. గందరగోళం చేసి వదిలేస్తాయి.

అడ్డుకున్నామా.. అంతే సంగతులు.. మీదికి ఎగబడి కరిచి, కొరికి నానా హంగామా చేస్తాయి. వీటి భయానికే గుండె ఆగి చనిపోయిన కేసులూ ఉన్నాయి. అయితే ఇవి ఇలా రెచ్చిపోవడానికి కారణం అడవులు నశించిపోతుండడమే. దీంతో తమ ఆకలి తీర్చుకోవడానికి ఇవి జనావాసాల మీదికి దాడిచేస్తున్నాయి. 

తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి కర్ణాటకలో జరిగింది. ఓ మద్యం దుకాణం ముందు కోతులు మందు పార్టీ చేసుకున్నాయి. అసలే కోతులు ఆపై మందు తాగాయి.. ఇంకే వాటిని పట్టవశం అవుతుందా? అనుకుంటున్నారా.. అసలు విషయం తెలిస్తే.. మీరూ కదిలి పోతారు.. 

నడిరోడ్డుమీద ఈ అమ్మడు వంగి చేసిన పనికి.. అందరూ ఫిదా...

కర్ణాటకలోని ఓ మద్యం షాపు ముందు కోతులు మందు పార్టీ చేసుకున్నాయి. బెంగళూరు రూరల్ విజయపుర పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న కొన్ని కోతులు విజయపుర పట్టణంలోని ఓ మద్యం దుకాణం వద్దకు వచ్చాయి. అక్కడున్న ఖాళీ మద్యం సీసాలను వాటర్ ప్యాకెట్ లను ఏరి అన్నింటిని ఒక దగ్గరకు చేర్చాయి. ఖాళీ సీసాల్లో మిగిలిపోయిన మద్యాన్ని తాగేసాయి. ఈ దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్గా మారాయి. అదండీ విషయం..