బస్సులోని విండో సీటు దొరకగానే పడుకొని నిద్రపోయింది. ఆమె.. మహిళలకు కేటాయించిన సీటులోనే కూర్చుంది. ఆమె పక్క సీటులో ఖాళీగా ఉండగా.. ఓ వ్యక్తి కూర్చుున్నాడు.

ఓ మహిళా ఉద్యోగినికి బస్సులో వేధింపులు ఎదురయ్యాయి. బస్సులో ప్రయాణిస్తుండగా.. ఓ తోటి ప్రయాణికుడు.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కాగా.. తనను వేధించిన నిందితుడిని పట్టుకొని.. మరీ ఆమె పోలీసులకు అప్పగించింది. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సదరు మహిళ తన ఆఫీసు పనివేళలు ముగిసిన తర్వాత రాత్రి 8గంటల 30 నిమిషాల సమయంలో ఆమె బస్సు ఎక్కింది. కాగా.. ఆఫీసులో పనితో అలసిపోయిన మహిళ.. బస్సులోని విండో సీటు దొరకగానే పడుకొని నిద్రపోయింది. ఆమె.. మహిళలకు కేటాయించిన సీటులోనే కూర్చుంది. ఆమె పక్క సీటులో ఖాళీగా ఉండగా.. ఓ వ్యక్తి కూర్చుున్నాడు.

ఆ తర్వాత.. నిద్రపోతున్న ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని చేతులతో తాకడం మొదలుపెట్టాడు. ఉలికిపడి లేచిన మహిళ.. వెంటనే బస్సు ఆపాలంటూ డ్రైవర్ కి చెప్పింది. బస్సు ఆపమనగానే.. నిందితుడికి సీన్ అర్థమై అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు.

కాగా.. పారిపోతున్న నిందితుడిని వదిలేయకుండా.. అతని వెంటపడి మరీ సదరు మహిళ నిందితుడిని పట్టుకోవడం గమనార్హం. వెంటనే పోలీసులు నిందితుడిని అప్పగించింది. నిందితుడు తప్పించుకోవాలని ప్రయత్నించినా.. ధైర్య సాహాసాలు చూపించి మరీ.. మహిళ పట్టుకుందని పోలీసులు ఆమెను మెచ్చుకున్నారు. 

నిందితుడు మహమ్మద్ తాజ్ గా గుర్తించారు. అతను బిహార్ లోని మీర్జాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.