రాహుల్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం ఒకే.. విచారణ తేదీ ఎప్పుడంటే..

మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.

Modi surname case SC to hear Rahul Gandhi appeal against Gujarat HC judgment on July 21 ksm

మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21న విచారణ  చేపట్టనున్నట్టుగా తెలిసింది. ఈ కేసులో తనకు మెజిస్ట్రేట్ కోర్టు విధించిన దోషి, రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇవ్వడానికి గుజరాత్ హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్‌కు సంబంధించి అత్యవసర జాబితాను కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు రాహుల్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మంగళవారం ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘శుక్రవారం లేదా సోమవారం తేదీని కోరుతున్నాను’’ అని అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. అయితే ఈ పిటిషన్‌‌ను శుక్రవారం (జూలై 21) జాబితా చేయండి అని జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. 

ఇక, 2019లో కర్ణాటకలోని కోలార్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఉంది’’ అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని నీరవ్ మోదీ, లలిత్ మోదీ వంటి పరారీలో ఉన్న వ్యక్తులతో రాహుల్ ముడిపెట్టారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనను ఇటీవల దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. 


అయితే ఈ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే రాహుల్ వినతిని జూలై 7న గుజరాత్‌ హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ గాంధీకి రిలీఫ్ ఇచ్చేందుకు నిరాకరించారు. నేరారోపణపై స్టే విధించడం ఒక నియమం కాదని.. అరుదైన కేసుల్లో మాత్రమే దీనిని అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాముల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios