అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ రెస్టారెంట్ ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో ప్రత్యేకంగా ‘‘మోదీ జీ’’ థాలీని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు ఈ పరిణామాం చోటుచేసుకుంది.

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ రెస్టారెంట్ ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో ప్రత్యేకంగా ‘‘మోదీ జీ’’ థాలీని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు ఈ పరిణామాం చోటుచేసుకుంది. ఈ మేరకు ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది. భారతీయ సంతతికి చెందిన ఈ రెస్టారెంట్ యజమాని శ్రీపాద్ కులకర్ణి మాట్లాడుతూ.. అక్కడ నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీ డిమాండ్‌పై ప్రత్యేకంగా థాలీని అందిస్తున్నట్టుగా చెప్పారు. అలాగే ‘‘మోదీ జీ’’ థాలీ వివరాలను కూడా పంచుకున్నారు. 

ఈ థాలీలో కిచిడి, రసగుల్లా, సర్సోన్ కా సాగ్, కశ్మీరీ దమ్ ఆలూ, ఇడ్లీ, ధోక్లా, చాచ్, పాపడ్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది స్పెషల్ థాలీని ప్రయత్నించారని రెస్టారెంట్ యజమాని శ్రీపాద్ కులకర్ణి తెలిపారు. వీడియోలో కనిపించే అనేక మంది కస్టమర్‌లు, వారు ఆహారాన్ని ఇష్టపడ్డామని.. భారతీయ సమాజంలో థాలీ చాలా ప్రజాదరణ పొందిందని చెప్పారు. అయితే ‘‘మోదీ జీ’’ థాలీ ధరను పేర్కొనలేదు.

Scroll to load tweet…


ఇదిలా ఉంటే, గతేడాది ఢిల్లీకి చెందిన ఒక రెస్టారెంట్ కూడా ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అంకితం చేసిన 'థాలీ'ని ప్రారంభించింది. కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఆర్డోర్ 2.1 రెస్టారెంట్.. 56 ఆహార పదార్థాలతో కూడిన ఈ థాలీని ప్రారంభించింది. కస్టమర్ వెజ్, నాన్ వెజ్ ఫుడ్‌ను ఎంచుకునే అవకాశం కల్పించింది. 

ఇక, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ బిడెన్‌ల ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూన్‌ 21-24 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనకు జో బైడెన్ దంపతులు వైట్ హౌస్‌లో విందు ఆతిథ్యం ఇస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇక, అమెరికా, భారత్‌ల మధ్య లోతైన, సన్నిహిత భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఒక అవకాశంగా నిలుస్తుందని వైట్‌హౌస్ పేర్కొంది.