‘సహకర్ సే సమృద్ధి’ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా   మోడీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రత్యేకంగా ‘సహకార మంత్రిత్వ శాఖ’ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

‘సహకర్ సే సమృద్ధి’ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మోడీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రత్యేకంగా ‘సహకార మంత్రిత్వ శాఖ’ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ మంత్రిత్వ శాఖ దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక పరిపాలనా, చట్టపరమైన, విధాన చట్రాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది.

అట్టడుగు బడుగు, బలహీనవర్గాల వరకు సహకార సంస్థలు చేరుకుని మరింత క్రియాత్మకంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. మనదేశంలో సహకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి నమూనా చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేసే స్వభావం ఉండడం వల్ల సరిగ్గా వర్కవుట్ అవుతుంది. 

సహకార సంస్థల కోసం ‘వ్యాపారం చేయడాన్ని సులభం’ చేసే 
ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, బహుళ-రాష్ట్ర సహకార (ఎంఎస్‌సిఎస్) అభివృద్ధిని ప్రారంభించడానికి మంత్రిత్వ శాఖ పని చేస్తుంది.

ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేసే అభివృద్ధి భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం దీంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టవుతుంది. సహకారసంస్థల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను సృష్టించడం కూడా ఆర్థిక మంత్రి చేసిన బడ్జెట్ ప్రకటనను నెరవేరుస్తుంది.