ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోకి తీసుకొస్తూ బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

ప్రధాని సమావేశంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర సమాచార ప్రసార మంత్రి ప్రకాశ్ జవదేవకర్ మీడియాకు వెల్లడించారు.

దేశంలోని 1,482 సహకార బ్యాంకులు, 58 మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులు కూడా ఆర్‌బీఐ కిందకు తీసుకురావాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని.. అర్బన్ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిదని జవదేకర్ అన్నారు. దీనితో పాటు దేశంలో కరోనా విజృంభణ, నివారణ చర్యలతో పాటు భారత్- చైనా సరిహద్దు ఘర్షణలపై కీలక చర్చ జరిగినట్లు ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.