సారాంశం
మోడల్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ వ్యక్తి.. అత్యాచారం చేయడంతో పాటు, మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఇటీవల విడుదలైన ‘‘ది కేరళ స్టోరీ’’ చిత్రం చూసిన బాధిత మోడల్.. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మోడల్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ వ్యక్తి.. అత్యాచారం చేయడంతో పాటు, మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఇటీవల విడుదలైన ‘‘ది కేరళ స్టోరీ’’ చిత్రం చూసిన బాధిత మోడల్.. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు బుధవారం తెలిపారు. ఇక, బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం.. ‘‘నేను 2020లో ఖాన్ మోడలింగ్ ఏజెన్సీలో చేరింది. నిందితుడు అతడి పేరు యష్ అని తొలుత చెప్పాడు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. నాలుగు నెలల తర్వాత అతని అసలు పేరు తన్వీర్ అని గుర్తించాను. మేము కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాం.నిందితుడు నన్ను రాంచీకి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడాడు. ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చాడు’’ అని ఆరోపించింది. ముంబైలో ఉన్న సమయంలో కూడా తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆమె పేర్కొంది. ది కేరళ స్టోరీ చిత్రం చూసిన తర్వాత పోలీసులను ఆశ్రయించేలా ప్రేరణ పొందానని బాధిత మోడల్ తన ఫిర్యాదులో తెలిపింది.
ఇక, బాధిత మహిళ ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అత్యాచారం, ఇతర సంబంధిత నేరాలకు సంబంధించి వెర్సోవా పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ను నమోదు చేశారు. ఆరోపించిన సంఘటనలు రాంచీలో జరిగినందున కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసినట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఇక, . నిందితుడిని తన్వీర్ అక్తర్ లేక్ ఖాన్ (40)గా గుర్తించారు. అయితే ఈ ఆరోపణలను నిందితుడి ఖండించాడు. ఈ మేరకు అతడు సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా విడుదల చేశాడు.