న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మోడల్ మీద అత్యాచారం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 

ఢిల్లీలో నివాసం ఉంటున్న మోడల్ కు ముంబైకి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో 
ఓ వివాహ వేడుకకు హాజరవుతున్నట్లు అతను ఆమెకు సమాచారం ఇచ్చాడు. ఫోన్ ద్వారా ఆ సమాచారం అందించాడు.

అతను తన కుటుంబ సభ్యులను ఢల్లిలోని ఓ హోటుల్లో దింపాడు. ఆ తర్వాత యువతికి ఫోన్ చేసి తన స్నేహితుడి ఇంటి వద్ద కలుద్దామని ఆమెకు ఫోన్ ద్వారా సందేశం పంపించాడు. అందుకు ఆమె నిరాకరించింది.

అయితే, అతను అంతటితో వదలకుండా తాను ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్నానని, ఇద్దరం కలుద్దామని కోరాడు. ఆమె అక్కడికి వెళ్లింది. ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. ఆ తర్వాత ఆమెను మాటల్లోకి దింపి చాణక్యపురి ప్రాంతంలోని మరో హోటల్ కు తీసుకుని వెళ్లాడు. ఆ వ్యక్తి ఆ హోటల్లోని గదిలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మోడల్ ఫిర్యాదు చేసింది. 

ఆమె వృత్తిరీత్యా మోడల్ కాగా, నిందితుడు ముంబైకి చెందినవాడని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ఈ నెల 23వ తేదీన పోలీసు బృందాన్ని ముంబైకి పంపించారు.