బొమ్మ తుపాకీతో ఓ మోడల్‌ను బెదిరించి ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడగా.. ఆమె సమయస్ఫూర్తితో తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే... జైపూర్‌కు చెందిన ఓ యువతి స్నేహితురాలి ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఓ క్యాబ్ ఎక్కింది.

అర్ధరాత్రి కావడం, యువతి ఒంటరిగా ఉండటంతో క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడు బొమ్మ తుపాకీతో బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే ధైర్యంగా వ్యవహరించిన ఆ యువతి నిందితుడిని కొరికి తప్పించుకుంది.

అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలు తన మొబైల్ కారులో వదిలేసినట్లు తెలియడంతో... పోలీసులు ఆ నెంబర్‌కు కాల్ చేయడంతో నిందితుల్లో ఒకరు ఫోన్ లిఫ్ట్ చేశారు.

సాంకేతికత ఆధారంగా నిందితులు సచిన్ శర్మ, క్యాబ్ డ్రైవర్ సురేశ్ కుమార్ వర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు కొరకడంతో సచిన్ శర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.