న్యూ ఢిల్లీ: ఎవరినైనా మీ మొబైల్ నెంబర్ ఎంత అంటే, ఒక పది సంఖ్యల నెంబర్ ను చెబుతాడు. ఇకమీదట ఆ సంఖ్య 11 నంబర్లకు చేరుకోనుంది. పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా 11 అంకెలతో కూడిన మొబైల్ నెంబర్ ను అందుబాటులోకి తేవాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) యోచిస్తోంది. 

ప్రస్తుతమున్న 10 అంకెల నంబర్లతో 210 కోట్ల మంది వినియోగదారులకు కేటాయించవచ్చు. భవిష్యత్తులో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఈ ఆలోచనను ట్రాయ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా 11 అంకెల నంబర్లను కేటాయిస్తే, 2050 సంవత్సరం వరకు వినియోగదారులకు నంబర్లను కేటాయించే వీలుంటుంది. 

గతంలో చూసుకుంటే, మొదట 9 సిరీస్ తో నంబర్లు ప్రారంభమయ్యేవి. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా తరువాత 8 సిరీస్, 7,6 సిరీస్ లను కూడా ట్రాయ్ అందుబాటులోకి తెచ్చింది.