Asianet News TeluguAsianet News Telugu

బై పోల్ ముంగిట బీజేపీకి రాజ్ ఠాక్రే ఊహించని రిక్వెస్ట్.. ‘డియర్ దేవేంద్ర యాక్సెప్ట్ చేస్తావనుకుంటున్నా’

మహారాష్ట్రలో ఆంధేరి (ఈస్ట్) స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీకి లేఖ రాశారు. డియర్ ఫ్రెండ్ దేవేంద్ర అంటూ రిక్వెస్ట్ పెట్టారు.
 

mns chief raj thackeray unexpected request for bjp ahead of andheri east
Author
First Published Oct 16, 2022, 7:51 PM IST

ముంబయి: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కజిన్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీకి అనూహ్యమైన విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆయన రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆంధేరి(ఈస్ట్) నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికకు సంబంధించి ఆయన ఈ లేఖ రాశారు.

ఆంధేరి (ఈస్ట్) నియోజకవర్గ ఉపఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టకుండా ఉపసంహరించుకోవాలని ఆయన బీజేపీకి రిక్వెస్ట్ పెట్టారు. ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన రమేశ్ లట్కే ఇటీవలే మరణించారు. ఈ స్థానం నుంచి ఆయన భారర్య రుతుజ లట్కే పోటీ చేస్తున్నారు. ఆమె విజయం పొందడానికి బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపవద్దని కోరారు. 

‘ఇలా చేయడం ద్వారా మరణించిన శాసన సభ్యుడికి నివాళి అర్పించినట్టు అవుతుంది. మహారాష్ట్ర గొప్ప సంస్కృతిలో ఇది భాగం. దీన్ని పాటించడం మంచిది. నా విజ్ఞప్తిని మీరు స్వీకరిస్తారని భావిస్తున్నాను’ అంటూ లెటర్ రాశారు. డియర్ ఫ్రెండ్ దేవేంద్ర అని సంబోధిస్తూ ఈ లేఖ రాశారు.

Also Read: ‘పతనం అక్కడే మొదలవుతుంది’.. అన్నయ్య ఉద్ధవ్ ఠాక్రేకు రాజ్ ఠాక్రే కౌంటర్!.. ఫ్యామిలీ ఫైట్?

రమేశ్ లట్కే మంచి వర్కర్ అని రాజ్ ఠాక్రే వివరించారు. ఆయన కింది నుంచి పైకి ఎదిగిన నేత అని పేర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితానికి తానే సాక్షి అని వివరించారు. ఆయన స్థానంలో ఆయన భార్య ఎమ్మెల్యేగా గెలిస్తే రమేశ్ లట్కే ఆత్మకు శాంతి చేకూరుతుందని పేర్కొన్నారు.

అయితే, ఈ విజ్ఞప్తికి బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ, బీజేపీ అభ్యర్థి ముర్జి పటేల్ దీనిపై స్పందించారు. పార్టీ అడిగితే తాను తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు.

రుతుజ లట్కే బ్రిహన్‌ముంబయి కార్పరేషన్‌లో క్లర్క్‌గా పని చేశారు. ఆమె ఆంధేరి (ఈస్ట్)లో పోటీ చేయడం కోసం ముందుగా రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ, ఏక్‌నాథ్ షిండే ఫ్యాక్షన్ ఆమె రాజీనామాను ఆమోదించకుండా ఇన్‌ఫ్లుయెన్స్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఆమె కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల తర్వాత ఆమె నామినేషన్ వేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios