Traffic Rules: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కేరళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలను ఉల్లంఘించిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి భారీ జరిమానాలను విధించింది.

Traffic Rules: మన దేశంలో ట్రాఫిక్‌ రూల్స్ పాటించకుండా రోడ్లపై తిరగడం షరా మామూలే.. ఇష్టానూసారంగా వాహనాలతో రోడ్లపై తిరుగుతూ.. ఇతర ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొంత మంది ఆకతాయితీ. అంతటితో ఆగకుండా.. ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు నానా ప్రయత్నాలు చేస్తారు. జరిమానాను తప్పించుకోవడానికి చాలా జాగ్రత్త పడుతారు. అలాంటి చర్యలను కట్టడి చేయడానికి కేరళ ప్రభుత్వం AI కెమెరాలు ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకున్న.. ఆ కెమెరాలు మాత్రం ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి. రోడ్డు ప్రమాదాల నివారించడానికి, రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ కెమెరాలను కీలకంగా పనిచేస్తున్నాయి. అంత బాగానే ఉన్నా.. కేరళల్లో ఈ కెమెరాలు మాత్రం వీవీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి.

వీవీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇబ్బంది ఎందుకు పడుతున్నారని అనుకుంటున్నారా..? ఇటీవల రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'సేఫ్ కేరళ' అనే ప్రాజెక్ట్ కింద నగరంలోని పలు ప్రాంతాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కెమెరాలను ఏర్పాటు చేసింది. తాజాగా తిరువనంతపురంలో రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు అధ్యక్షతన ఏఐ కెమెరాల పనితీరుకు సంబంధించి సమీక్షా సమావేశం జరిగింది. అయితే..వాటి పనితీరును అందర్నీ షాక్ గురి చేసింది. ఒకే ఒక నెలలో ఈ కెమెరాలు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన 32 లక్షల మందిని గుర్తించాయి. అందులో 19 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు సహా పలువురు వీఐపీలు ఉండటం గమనార్హం.

అదే సమయంలో ఒక ఎంపీ ఆరుసార్లు, ఒక ఎమ్మెల్యే ఏడుసార్లు ట్రాఫిల్ రూల్స్ పాటించకుండా కెమెరాలకు చిక్కారని, అలాగే.. 328 ప్రభుత్వ వాహనాలు సైతం ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘించినట్లు రవాణాశాఖ వెల్లడించింది. దీంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రవాణా శాఖ చలాన్లు జారీ చేసినట్టు తెలిపింది. జరిమానా చెల్లించని వారికి ఇన్స్యూరెన్స్ రెన్యువల్ చేయకూడదనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో వీవీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు షాక్ గురయ్యారు. అయితే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లు బయటపెట్టలేదు.

భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ఈ కెమెరాల సాయంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టిందని కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వీఐపీ వాహనాలకు జరిమానా విధించే అవకాశం లేదని ప్రజలలో సాధారణ అభిప్రాయం ఉందని, అయితే కేరళలో అలా లేదని కేరళ రవాణా మంత్రి ఆంటోని రాజు అన్నారు. ఈ కెమెరాలు అన్ని వాహనాలను రికార్డ్ చేస్తున్నాయని తెలిపారు.