Asianet News TeluguAsianet News Telugu

మానవతా దృక్ప‌థం కనబర్చిన ఎంకే స్టాలిన్.. ప్రమాద బాధితుడిని కాపాడేందుకు కాన్వాయ్ దిగివచ్చిన సీఎం

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కాన్వాయ్ సచివాలయానికి వెళ్తుండగా ఓ రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ఓ వ్యక్తిని హాస్పిటల్ కు పంపించేందుకు సీఎం తన కాన్వాయ్ ను ఆపి దిగి వచ్చారు. బాధితుడిని హాస్పిటల్ కు పంపించారు. 

MK Stalin who showed a humanitarian perspective. CM who came down in convoy to save the accident victim
Author
First Published Oct 22, 2022, 2:19 PM IST

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మానవతా దృక్ప‌థాన్ని కనబర్చారు. రోడ్డుపై ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని కాపాడేందుకు తన కాన్వాయ్ ను ఆపి ఆయన దిగి వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

రాయచూర్ నుండి పునఃప్రారంభ‌మైన రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర

వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నైలోని క్రోమ్ పేటకు చెందిన అరుల్రాజ్ డీఎంఎస్ సమీపంలో బైక్ పై నుంచి కింద పడ్డాడు. అయితే అదే సమయంలో అటు నుంచి సీఎం ఎంకే స్టాలిన్ క్వానాయ్ రాష్ట్ర సచివాలయానికి వెళ్తోంది. ఈ ప్రమాదాన్ని గమనించిన సీఎం తన క్వానాయ్ ను ఆపించారు. రోడ్డు దాటుకొని క్షతగాత్రుడి వద్దకు వెళ్లారు. బాధితుడికి ధైర్యం చెప్పి ఓ ఆటోలో కూర్చోబెట్టారు. అనంతరం క్షతగాత్రుడిని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. రోగిని జాగ్రత్తగా చూసుకోవాలని ఎమ్మెల్యేను, డాక్టర్ ఏజిల్ ను సీఎం ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios