అది ఇతరులకు అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన. మేము ఆస్పత్రిలో బాగానే ఉన్నాం. వైద్యులు, నర్సులు బాగా చూసుకుంటున్నారని మంత్రి ఆర్‌ లాల్జిర్లియానా మీడియాతో అన్నారు.అంతేకాకుండా తానున్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్‌కి ఫోన్ చేయగా అటువైపు నుంచి స్పందన రాలేదని, దీంతో తానే శుభ్రం చేసినట్లు వివరించారు.ఇంఫాల్: మిజోరం  విద్యుత్ శాఖ మంత్రి  ఆర్ లాల్జిర్లియానా కరోనా వార్డులో  నేలను శుభ్రం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   తాను  ఆసుపత్రిలో నేలను శుభ్రంచేసి వైద్యులు, నర్సులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. ఈ పని చేసి నేనొక ఉదాహరణగా నిలవాలన్నారు.  

అది ఇతరులకు అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన. మేము ఆస్పత్రిలో బాగానే ఉన్నాం. వైద్యులు, నర్సులు బాగా చూసుకుంటున్నారని మంత్రి ఆర్‌ లాల్జిర్లియానా మీడియాతో అన్నారు.అంతేకాకుండా తానున్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్‌కి ఫోన్ చేయగా అటువైపు నుంచి స్పందన రాలేదని, దీంతో తానే శుభ్రం చేసినట్లు వివరించారు."నాకు ఇలాంటి పనులు కొత్తేం కాదు. అవసరం అనుకున్నప్పుడు నేను ఇలాంటి పనులు చేస్తుంటాను. నేను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. ఇతరుల కంటే ఎక్కువని అనుకోవట్లేదు" అని ఆయన చెప్పారు. 

మంత్రితో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా అదే ఆసుపత్రిలో కోవిడ్‌ చికిత్స పొందుతున్నారు. గత సంవత్సరం మిజోరంలోని మంత్రులు వీఐపీ సంస్కృతిని పక్కన పెట్టి ఇంటి పనులు చేయడం, ప్రజా రవాణా, మోటారు బైక్‌లో ప్రయాణించారు. వీరు వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం క్రిస్మస్‌ వంటి పండుగ సీజన్‌లో వంట మనుషులుగా పనిచేయడం ద్వారా సామాన్యులుగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి.