Asianet News TeluguAsianet News Telugu

టిక్ టాక్ కి షాక్ ఇస్తున్న మేడిన్ ఇండియా యాప్...

తాజాగా ఈ యాప్ కి పోటీగా మేడిన్ ఇండియా యాప్ మిత్రో రంగంలోకి దిగింది. అతి కొద్ది రోజుల్లోనే మిత్రో యాప్ పాపులారిటీ పొందుతోంది. ఇప్పటికే 50 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు

Mitron App Crosses 50 Lakh Downloads on google play store
Author
Hyderabad, First Published May 28, 2020, 3:05 PM IST

ప్రముఖ మ్యూజిక్ యాప్ టిక్ టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో పాటలు, డైలాగ్ లకు లింప్ సింక్ ఇస్తూ, డ్యాన్సులు వేస్తూ యూత్ ఈ యాప్ ని విపరీతంగా వాడేస్తున్నారు. ఈ యాప్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సెలబ్రెటీ హోదా తెచ్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.

అయితే.. ఈ యాప్ మోజులో పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆ మధ్య దీనిని దేశంలో బ్యాన్ చేశారు. తర్వాత మళ్లీ తీసుకువచ్చారు.  అయితే.. మరోసారి భారత్ లో ఈ యాప్ ని బ్యాన్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిని బ్యాన్ చేయాలంటూ ప్రత్యేకంగా ఓ క్యాంపైన్ కూడా చేస్తుండటం గమనార్హం.

అంతేకాదు.. కావాలని ప్లేస్టోర్ లో ఈ యాప్ రేటింగ్ కూడా అమాంతం పడిపోయింది. కాగా.. తాజాగా ఈ యాప్ కి పోటీగా మేడిన్ ఇండియా యాప్ మిత్రో రంగంలోకి దిగింది. అతి కొద్ది రోజుల్లోనే మిత్రో యాప్ పాపులారిటీ పొందుతోంది. ఇప్పటికే 50 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమయ్యే ఈ యాప్‌కు ప్రస్తుతం 4.7 రేటింగ్ ఉంది. ఐఐటీ రూర్కీ విద్యార్ధి శివాంక్ అగర్వాల్ ఈ యాప్‌ను రూపొందించాడు. 

ఇప్పటి వరకు ఈ యాప్  డౌన్‌లోడ్‌లు కూడా 5 మిలియన్లను దాటాయి. అత్యంత వేగంగా ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందిన యాప్‌గా మిత్రోకు పేరొచ్చింది. 
టిక్‌టాక్ తరహాలో మిత్రోలో కూడా అన్ని తరహాలో టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫిల్టర్లు కూడా ఉన్నాయి. యూజర్లు చాలా సులభంగా వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు. షేర్ చేయవచ్చు. క్షణాల్లో వీడియో తీసుకుని ఏ మ్యూజిక్ క్లిప్ కానీ మూవీ డైలాగ్‌కానీ సింక్ చేసుకోవచ్చు. మిత్రో యాప్‌కు మల్టీ మీడియా కంటెంట్‌ కొదువే లేదు. 

ప్రస్తుతానికి మిత్రో యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే గూగుల్ ప్లే స్టోర్‌లోఅందుబాటులో ఉంది. 8 ఎంబీ కన్నా తక్కువ సైజులో ఉండటం వల్ల స్మార్ట్‌ఫోన్లలో తక్కువ స్పేస్ సరిపోతుంది. త్వరలోనే యాపిల్ స్టోర్లలోనూ ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. 

ఇదిలా ఉండగా...కరోనా వైరస్‌తో పాటు సరిహద్దు వద్ద చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత్‌లో డ్రాగన్ దేశంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అందుకే చైనా తయారీ వస్తువులు, చైనా టెక్నాలజీ, చైనా యాప్‌ల వాడకాన్ని భారతీయులు క్రమంగా తగ్గిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చైనాపై వ్యతిరేకత పెరుగుతోంది. 

దీనిలో భాగంగానే.. టిక్‌టాక్ యాప్‌పై దీని ప్రభావం పడినట్లుంది. బ్యాన్ టిక్ టాక్ అనే హ్యాష్‌టాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీని ప్రభావంతో ప్లే స్టోర్‌లో టిక్‌టాక్ టాప్ ర్యాంకింగ్ నుంచి పడిపోయింది. ప్రస్తుతం దీని రేటింగ్ 1.4కు దిగజారిపోవడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios