Asianet News TeluguAsianet News Telugu

క్లాస్ రూంలో ముస్లిం స్టూడెంట్‌ను టెర్రరిస్టుతో పోల్చిన ప్రొఫెసర్.. ‘26/11 జోక్ కాదు సార్’.. వీడియో వైరల్

బెంగళూరులోని మణిపాల్ యూనివర్సిటీలో క్లాసు జరుగుతూ ఉండగా ఓ ప్రొఫెసర్ ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చాడు. దీనికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ విద్యార్థి ప్రొఫెసర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

MIT professor calls student as terrorist probe ordered
Author
First Published Nov 28, 2022, 7:16 PM IST

న్యూఢిల్లీ: కర్ణాటక రాజధాని బెంగళూరులోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఓ ప్రొఫెసర్.. ముస్లిం స్టూడెంట్‌ను టెర్రరిస్టుతో పోల్చాడు. ఆ విద్యార్థితో ప్రొఫెసర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అనంతరం, ఆ ప్రొఫెసర్‌ను మిట్ యాజమాన్యం సస్పెండ్ చేసింది.

ముస్లిం స్టూడెంట్‌ను పేరేంటని ఆ ప్రొఫెసర్ అడిగాడు. విద్యార్థి తన పేరు చెప్పగానే.. ముస్లిం పేరుగా గుర్తించి ‘ఓహ్.. అంటే నీవు కసబ్ లెక్క’ అని అన్నాడు. దీంతో ఆ విద్యార్థి అభ్యంతరం తెలిపాడు. 26/11 ఘటన ఫన్నీ కాదు అని అన్నాడు. ఒక ముస్లిం అయినందుకు దేశంలో రోజూ ఇలాంటివి ఫేస్ చేయడం ఫన్నీ కాదు అని ఆగ్రహించాడు. దీంతో ఆ ప్రొఫెసర్ ముస్లిం స్టూడెంట్‌ను చల్లార్చే పని చేశాడు. నువ్వు నా కొడుకు లాంటివాడివి అని పేర్కొన్నాడు. లేదు.. ఇది సరికాదు.. మీ కొడుకును ఇలాగే టెర్రరిస్టు అని పిలుస్తావా? అని నిలదీశాడు. ‘మీ కొడుకుతో టెర్రరిస్టు అనే మాట్లాడతావా?  ఇంత మంది ముందు నన్ను టెర్రరిస్టు అని పిలుస్తావా? ఇది క్లాస్. మీరు ఒక ప్రొఫెసర్. మీరు చదువు చెప్పేవారు. మీరు నన్ను అలా పిలించి ఉండాల్సింది కాదు’ అని స్టూడెంట్ వాదించాడు.  ఆ తర్వాత వీడియోలో ప్రొఫెసర్ విద్యార్థికి సారీ చెబుతున్నట్టు వినిపించింది.

Also Read: hate speech: ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ హరిద్వార్‌లో విద్వేష ప్రసంగం.. కేసు నమోదు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.దీనిపై ఎంఐటీ సంస్థ ఇండియా టుడే మీడియా సంస్థతో మాట్లాడింది. ఇలాంటి ఘటనలను తాము ఖండిస్తామని మణిపాల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఎస్పీ కార్ అన్నారు. తమ సంస్థ సర్వ ధర్మ (అన్ని మతాలను గౌరవించడం), వసుధైవ కుటుంబకం అనే సూత్రాన్ని పాటిస్తుందని వివరించారు. ఆ ప్రొఫసర్ పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థికి కౌన్సెలింగ్ ఇస్తామని, ప్రొఫెసర్‌ను కాలేజీ నుంచి సస్పెండ్ చేశామని వివరించారు.

తాము సంస్థ సజావుగా సాగడానికి ప్రయత్నిస్తామని, ఘటనకు సంబంధించి సమాధానాలు ఆ ప్రొఫెసరే చెప్పాలని అన్నారు. ఇది ఓ నార్మల్ సెషన్ జరుగుతుండగా చోటుచేసుకున్న ఘటన అని తెలిపారు. ఈ ఇష్యూ ఎలా మొదలైంది చెప్పలేమని, అసలు వీడియో ఎవరు తీశారో కూడా తెలియదని చెప్పారు. తాము ఈ ఘటనను సూమోటుగా స్వీకరించి యాక్షన్ తీసుకున్నామని వివరించారు.

26/11 ముంబయి దాడుల బీభత్సం సృష్టించిన టెర్రరిస్టుల్లో ప్రాణాలతో దొరికిన ఏకైక తీవ్రవాది అజ్మల్ కసబ్. అతడిని 2012లో ఉరి తీసి చంపేసిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios