ఇంటి నుంచి కోపంగా వెళ్లిపోయిన ఓ వ్యక్తి... దాదాపు 10 నెలల తర్వాత ఎముకల గూడై కనిపించాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రామనాథపురం, కముది మండల మాణిక్యం సమీపం వల్లండైకి చెందిన తిరుజ్నానం(60). అతనికి భార్య ముత్తురాక్క ఉంది. కాగా.. భార్యభర్తలు తరచూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు. ఈ క్రమంలో తిరుజ్నానం కోపంతో తరచూ ఇళ్లు వదిలేసి వెళ్లిపోయేవాడు. తర్వాత మరో రెండు నెలలకు ఇంటికి చేరుకునేవాడు.

తరచూ వారికి ఇలా జరుగుతూనే ఉండేది. అయితే.. 9నెలల క్రితం కూడా ఇంటి నుంచి కోపంగా వెళ్లిన తిరుజ్నానం తిరిగి ఇంటికి చేరలేదు. ఇంతకాలం ఇంటికి రాకుండా ఎప్పుడూ లేకపోవడంతో.. అనుమానంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. 

ఈ క్రమంలో ఆదివారం వల్లలాంలో ఊరికి చివరగా ఉన్న ఓ బావిలో చేతిలో సెల్‌ఫోన్‌లో ఎముకల గూడు ఒకటి బావిలో పడి వుండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎముకల గూడుని పైకి తీసి సెల్‌ఫోన్‌ ఆధారంగా విచారణ చేయగా అది అదృశ్యమైన తిరుజ్ఞానం మృతదేహమని తెలిసింది. దీంతో పోలీసులు ఎముకల గూటిని ఫోరెన్సిక్‌ పరిశోధనకు పంపి దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.