శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని (ఎల్ఓసీ) వద్ద అదృశ్యమైన హావాల్దర్ రాజేంద్రసింగ్ నేగీ మృతదేహాం శనివారం నాడు లభ్యమైంది. అతని వయస్సు 36 ఏళ్లు. 8 మాసాలుగా రాజేంద్రసింగ్ నేగీ అదృశ్యమైన విషయం తెలిసిందే.

కాశ్మీర్ లోయలోని ఎల్ఓసీ సమీపంలో మంచు చరియల కింద నేగీ మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేగీ కుటుంబసభ్యులకు తెలిపారు.భారత సైన్యానికి చెందిన 11 గర్వ్హాల్ రైఫిల్స్ కు అనుబంధంగా బెటాలియన్ లో నేగీ పనిచేస్తున్నాడు.  ఈ ఏడాది జనవరిలో కాశ్మీర్ లో గుల్ మార్గ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో భారీ మంచులో పడి ఆయన తప్పిపోయాడు.

నేగీ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతడు అమరుడైనట్టుగా సైన్యం ప్రకటించింది.నేగీ డెడ్ బాడీని చూసే వరకు అతడిని అమరవీరుడిగా గుర్తించబోమని నేగీ భార్య రాజేశ్వరీ ప్రకటించింది. 

నేగీ మృతదేహం లభించిన విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలిపారు.  నేగీ మృతదేహాన్ని మిలటరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.  ఈ విషయాన్ని నేగీ కుటుంబసభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు.

ఇవాళ సాయంత్రానికి డెహ్రడూన్ కు నేగీ మృతదేహం చేరుకొంటుందని ఆర్మీ ప్రకటించింది. డ్రెహ్రాడూన్ కు చెందిన నేగీ 2001లో సైన్యంలో చేరాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.