Miss World 2024 : ముప్పై ఏళ్ల తరువాత భారత్ లో మిస్ వరల్డ్ పోటీలు...
భారత్ మరో అంతర్జాతీయ వేడుకకు వేదిక కానుంది. మూడు దశాబ్దాల తరువాత మరోసారి మిస్ వరల్డ్ అందాలపోటీలు ఈ నెలలో ఢిల్లీలో ప్రారంభం కానున్నాయి.
న్యూ ఢిల్లీ : మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ ఫిబ్రవరి 18 నుండి మార్చి 9 వరకు ఇండియాలో జరుగుతుందని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీ భారత్ లో జరగబోతోంది. ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలో ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ITDC)చే "ది ఓపెనింగ్ సెర్మనీ", "ఇండియా వెల్కస్ ది వరల్డ్ గాలా"తో ఈ పోటీ ప్రారంభమవుతుంది.
ఇది మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసారం జరుగుతుంది. న్యూ ఢిల్లీలోని భారత్ మండపంతో సహా వివిధ వేదికలపై ఈ పోటీ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి 120 మంది పోటీదారులు వివిధ పోటీలు, స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటారు.
ప్రస్తుత ప్రపంచ సుందరి, పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా, మాజీ విజేతలు టోనీ ఆన్ సింగ్ (జమైకా), వెనెస్సా పోన్స్ డి లియోన్ (మెక్సికో), మానుషి చిల్లర్ (భారతదేశం) స్టెఫానీ డెల్ వల్లే (ప్యూర్టో రికో)లతో కలిసి ఇక్కడ విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్
మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ మాట్లాడుతూ.. “భారతదేశం అంటే నాకు విపరీతమైన ప్రేమ. అలాంటి దేశంలో 71వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ జరగడం నాకు చాలా ఇష్టం. భారతదేశానికి ఈ పోటీలు తిరిగి రావడానికి జమీల్ సైదీ తీవ్రంగా కృషి చేశార. వారికి ధన్యవాదాలు. మిజ్ వరల్డ్ పోటీల 71వ ఎడిషన్ కోసం అత్యుత్తమ జట్టును ఎంపికచేశాం" అని తెలిపారు.
భారతదేశం చివరిసారిగా 1996లో అంతర్జాతీయ పోటీకి ఆతిథ్యం ఇచ్చింది. 2017లో కిరీటాన్ని కైవసం చేసుకున్న చిల్లర్ ఇటీవలి కాలంలో ఈ కిరీటం గెలుచుకున్న భారతీయురాలు. అంతకుముందు, రీటా ఫరియా పావెల్, ఐశ్వర్య రాయ్, డయానా హేడెన్, యుక్తా ముఖి, ప్రియాంక చోప్రా జోనాస్ ఈ పోటీలో విజయం సాధించారు. కర్ణాటకకు చెందిన సిని శెట్టి, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 ప్రతిష్టాత్మక పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.