ఆమెకు సోషల్ మీడియాలో 756 వేల మంది ఫాలోవర్స్ ఉండగా.. ఓట్లు మాత్రం 1519 మాత్రమే రావడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయ ఢంకా మోగించింది. కాగా.. కాంగ్రెస్ కి మాత్రం పరాజయం తప్పలేదు. కాగా.. కాంగ్రెస్ తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ బ్యూటీ క్వీన్.. దారుణంగా ఓటమి పాలయ్యింది.

2018లో మిస్ బికినీ యూనివర్స్ ఇండియాగా నిలిచిన అర్చనా గౌతమ్, తాజా ఎన్నికల్లో యూపీలోని హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసింది. అయితే, ఆమెకు 1,519 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆమెకు సోషల్ మీడియాలో 756 వేల మంది ఫాలోవర్స్ ఉండగా.. ఓట్లు మాత్రం 1519 మాత్రమే రావడం గమనార్హం.

ఇక్కడ బీజేపీ, ఎస్పీ అభ్యర్థులకు అర్చన కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బీజేపీ అభ్యర్థికి 1,07,587 ఓట్లురాగా, ఎస్పీ అభ్యర్థికి 1,00,275 ఓట్లు వచ్చాయి. వాళ్లిద్దరితో పోలిస్తే అర్చనకు ఒక్క శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. అయితే, తనకు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు అర్చన థాంక్స్ చెప్పడం విశేషం.

ఇదిలా ఉండగా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మ‌రోసారి భారీ మెజారిటీతో గెలుపొందిన‌ బీజేపీ.. మ‌రోసారి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ విజ‌యం సాధించడంతో గత రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి. యోగి ఆదిత్య‌నాథ్ సరికొత్త చరిత్రను సృష్టించారు. యూపీలో బీజేపీ తిరుగులేని.. ఎదురులేని పార్టీగా నిల‌బెట్టాడు. వ‌రుస‌గా రెండోసారి సీఎంగా కానున్న‌.. తొలి బీజేపీ అభ్య‌ర్థిగా యోగీ ఆదిత్య‌నాథ్ రికార్డు సృష్టించ‌బోతున్నారు. గ‌తంలో.. యోగీ కంటే ముందు క‌ళ్యాణ్‌సింగ్‌, రామ్ ప్ర‌కాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్ లు బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసినా వారు రెండో సారి అధికారం చేజిక్కించుకోలేక‌పోయారు.