ఉదయ్‌పూర్- అహ్మదాబాద్ మధ్య కొద్ది రోజుల కిందట ప్రారంభించబడిన రైల్వే లైన్‌లో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై పగుళ్లు కనిపించడంతో స్థానికులు అధికారులను అప్రమత్తం చేయడంతో.. ఆ మార్గం రైళ్ల రాకపోకలను నిలిపివేయబడ్డాయి.

ఉదయ్‌పూర్- అహ్మదాబాద్ మధ్య కొద్ది రోజుల కిందట ప్రారంభించబడిన రైల్వే లైన్‌లో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై పగుళ్లు కనిపించడంతో స్థానికులు అధికారులను అప్రమత్తం చేయడంతో.. ఆ మార్గం రైళ్ల రాకపోకలను నిలిపివేయబడ్డాయి. అయితే డిటోనేటర్లు ఉపయోగించి రైల్వే ట్రాక్‌ను పేల్చివేసినట్టుగా తెలుస్తోంది. దీని వెనక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాలు.. శనివారం రాత్రి ఉదయ్‌పూర్-సాలంబర్ రహదారిలోని కెవ్‌డే కి నాల్‌లోని ఓధా రైల్వే వంతెనపై పేలుడు చోటుచేసుకున్నట్టుగా స్థానికులకు పెద్ద శబ్దం వినిపించింది. దీంతో వారు ఘటన స్థలానికి వెళ్లి రైల్వే ట్రాక్‌పై పగుళ్లు కనిపించాయి. అలాగే అక్కడ గన్‌పౌడర్‌ కూడా కనిపించిందని చెబుతున్నారు. అలాగే పలుచోట్ల పట్టాలు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది.

దీంతో స్థానికులు వెంటనే అక్కడ ఎర్రటి గుడ్డ కట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు, రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తుల సమాచారంతో ఆదివారం ఉదయం రైల్వే అధికారులు, పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మార్గంలో నడిచే రైళ్లను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఘటన స్థలంలో మరమ్మతులు చేసే పనిని రైల్వేశాఖ ప్రారంభించింది. అయితే రైళ్ల రాకపోకలు తిరిగి ఎప్పటి నుంచి బయలుదేరుతుందో రైల్వే అధికారులు చెప్పలేదు.

ఈ ఘటనపై విచారణ జరుగుపుతున్న పోలీసులు.. కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్ర కుట్ర అనుమాల నేపథ్యంలో ఉదయపూర్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు వెల్లారు. 

ఉదయపూర్-అహ్మదాబాద్ రైల్వే ట్రాక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 31న అసర్వా రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించారు. అహ్మదాబాద్‌ జిల్లాలోని అసర్వ రైల్వే స్టేషన్ అహ్మదాబాద్-ఉదయ్‌పూర్ లైన్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఒకటి. ఈ రైల్వే లైన్ ప్రారంభమైనప్పటి నుంచి ఉదయపూర్-అసర్వ రైళ్లు ఈ మార్గంలోనే నడపబడుతున్నాయి.