బెంగళూరు: అదృష్టం ఉంటే అద్భుతం జరుగుతుందని అంటారు. అది బెంగళూరులో నిజమైంది. తన చిన్నారిని తీసుకుని ఓ జంట బెంగళూరు రోడ్డుపైకి వచ్చారు. పిల్లాడిని ముందు కూర్చొబెట్టుకున్న తండ్రి వేగంగా బైక్ నడిపాడు. తండ్రి ఫాస్ట్‌గా డ్రైవింగ్ చేస్తుంటే.....పిల్లాడు నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. కొడుకు బోసి నవ్వులను చూసిన తండ్రి మరింత వేగంతో బైక్ నడిపాడు. 

అంతలో పక్కన ఉన్నవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఆ బైక్ అదుపు తప్పింది.  దీంతో తల్లిదండ్రులు వాహనాం పై నుంచి కింద పడిపోయారు....పిల్లాడు మాత్రం బైక్‌పై ఉన్నాడు.. బైక్ అదే వేగంతో ముందుకు దూసుకుపోయింది. రోడ్డుపై వెళుతున్నవాహనాలను 300 మీటర్ల మేర తప్పించుకుని ముందుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ ఉన్న బాలుడు పక్కనే ఉన్న గడ్డిపై పడిపోయాడు. 

అటుగా వెళ్తున్నప్రజలు చూసి బాలుడిని చూశారు. అయితే బాలుడు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలుడు తల్లిదండ్రులు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు ఈ అద్భుత దృశ్యం బెంగళూరులో హల్ చల్ చేస్తోంది.  అందరూ ఆ పిల్లాడు గురించే చెప్పుకుంటున్నారు. అదృష్టం అంటే ఇదే అని అంటున్నారు.