చదువుపై దృష్టి పెట్టమని మందలించిన ఉపాధ్యాయుడిని మైనర్ కత్తితో పొడిచాడు. ఈ దారుణమైన ఘటనలో ఆ ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

చదువుపై దృష్టి పెట్టమని మందలించిన ఉపాధ్యాయుడిపై పగతో రగిలిపోయిన ఓ విద్యార్థి దారిలో కాపుకాసి మరీ కత్తితో దాడిచేశాడు. గాయపడిన ఉపాధ్యాయుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. టీచర్‌ను కత్తితో పొడిచిన మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వివరాల్లోకెళ్తే.. రాజు ఠాకూర్ అనే వ్యక్తి స్థానికంగా ట్యూషన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం మీరా రోడ్‌లోని పెంకరపాడు ప్రాంతంలో అతడు తన స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఓ మైనర్ బాలుడు అతని వైపు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ టీచర్ పై దాడి చేశాడు. ఆ యువకుడ్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

ఆ బాలుడు ఆ ట్యూషన్ టీచర్‌ కడుపులో కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ కిందపడిపోయాడు. ఇంతలో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన ట్యూషన్ టీచర్‌ రాజు ఠాకూర్‌ను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ టీచర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే పారిపోయిన మైనర్‌ యువకుడు అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. వైరల్ వీడియోలో టీచర్ ఠాకూర్ కొంతమంది యువకులతో మాట్లాడుతున్నప్పుడూ ఓ మైనర్ అతని వైపుకు వచ్చి కత్తితో దాడి చేశాడు. ఠాకూర్ ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ మైనర్ ఆగకుండా కత్తితో ఠాకూర్ వీపులో, కడుపులో పొడిచాడు. ఠాకూర్ స్నేహితులు, చూపరులు ఆపమని కోరినప్పటికీ.. ఆ మైనర్ ఠాకూర్‌ను నేలపై పడే వరకు కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన టీచర్‌ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ మైనర్ బాలుడు కత్తిని విసిరి అక్కడి నుండి వెళ్లిపోయాడు. విద్యార్థుల కోసం కోచింగ్ క్లాస్ నిర్వహిస్తున్న ఠాకూర్ క్లాస్‌లో విద్యార్థిని కొట్టాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

చదువుపై దృష్టి పెట్టడం లేదని, విద్యార్థినీలతో సన్నిహితంగా ఉండటం మానుకోవాలని మందలించడంతో మైనర్ విద్యార్థి కోపం పెంచుకున్నాడనీ, గతంలో కూడా ఆ ఉపాధ్యాయుడితో ఆసభ్యపదజాలంతో దూషించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు మైనర్‌పై కేసునమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.