పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని ఓ స్కూల్ లో టీచర్, విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత మైనర్ బాలికను వాష్ రూంలో బంధించాడు.
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ పాఠశాల ఆవరణలో మైనర్ బాలికపై ఆమె ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. ఆ టీచర్ బాధితురాలు టాయిలెట్‌కు వెడుతుంటూ వెంబడించి, వాష్ రూంలో బంధించి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె సహాయం కోసం అరవడంతో ఆమెను బాత్రూంలో పెట్టి, తాళం వేశాడు.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. జూలై 21న ఢోలాఘాట్ హై మదర్సాకు చెందిన ఫైజుద్దీన్ మొల్లా అనే నిందితుడు బాధితురాలు వాష్ రూంకు వెడుతుండగా వెంబడించాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో అతను ఆమెను వాష్‌రూమ్‌లో లాక్కెళ్లి, చెంపదెబ్బ కొట్టాడు. ఆ తరువాత అక్కడే ఆమెను బంధించి, తాళం వేశాడు.
శివకాశీలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరి మృతి, నుజ్జునుజ్జయిన మృతదేహాలు
బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అవి విన్న ఆమె స్నేహితులు రక్షించారు. వాష్ రూం నుంచి ఆమెను బైటికి తీసుకునవచ్చి జరిగిన విషయాన్ని ఆమె తల్లికి సమాచారం అందించారు.
“ఫైజుద్దీన్ మొల్లా టాయిలెట్ బయట తాళం వేసి నా కూతుర్ని అందులో బంధించాడు. విషయం తెలిసి నేను స్కూల్ దగ్గరికి చేరుకున్నాను. నా కూతురిని అలా ఎందుకు బంధించారని ఆరా తీశాను. దీనికి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది” అని బాధితురాలి తల్లి పేర్కొంది.
దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం ఢోలాఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం సాయంత్రం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.
