ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం తాజాగా వెలుగు చూసింది. ఓ కామాంధుడైన భర్త భార్య ముందే 16 యేళ్ల దళిత బాలికమీద అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ సరిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. 

లక్నో : మహిళల మీద అకృత్యాలు అదుపుతప్పుతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులమీదా అఘాయిత్యాలు ఆగడం లేదు. మరోవైపు ఓ మహిళ స్వయంగా ఓ మైనర్ ను తీసుకెళ్లి మరీ భర్తతో అత్యాచారం చేయించడం కలకలం రేపింది. 

ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ దళిత బాలికను స్వయంగా భార్యే తీసుకువెళ్లి... భర్తకు అప్పగించింది. అతను ఆ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం తాజాగా వెలుగు చూసింది. ఓ కామాంధుడైన భర్త భార్య ముందే 16 యేళ్ల దళిత బాలికమీద అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ సరిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. 

తన కుమార్తెను నిందితుడి భార్య తీసుకువెళ్లి తన భర్తకు అప్పజెప్పి అత్యాచారం చేయించిందని బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధిత బాలిక తల్లి కోర్టును ఆశ్రయించింది. 

నిందితుడు తన భార్య ముందు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కుటుంబ సభ్యులను బెదిరించాడని పోలీసులు తెలిపారు. 

కోర్టు ఆదేశంతో నిందితులైన దంపతులమీద కేసు నమోదు చేశామని, బాలికను వైద్య పరీక్షల కోసం పంపించామని సీనియర్ పోలీసు అధికారి సర్వేష్ సింగ్ చెప్పారు. ఈ కేసు మీద విచారణ జరుపుతున్నామని, నిందితులైన దంపతులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సింగ్ తెలిపారు.