భార్యతో గొడవలు.. పనిపిల్లపై ఐటీశాఖ అధికారి అత్యాచారం

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 7, Sep 2018, 11:52 AM IST
minor girl raped by income tax deputy commissioner
Highlights

తన కింద పనిచేసే వారి క్షేమాన్ని చూసుకోవాల్సిన ఉద్యోగే పశువులా వ్యవహరించాడు. తన ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

తన కింద పనిచేసే వారి క్షేమాన్ని చూసుకోవాల్సిన ఉద్యోగే పశువులా వ్యవహరించాడు. తన ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబై ఐటీ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తికి భార్యతో మనస్పర్థలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఆయన ఇంట్లో ఓ 17 ఏళ్ల బాలిక పనిచేస్తోంది. ఈ క్రమంలో తనపై యజమాని అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిప్యూటీ కమిషనర్‌‌ను అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

loader