కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను తల్లిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌కి చెందిన ఓ వ్యక్తి 13 ఏళ్ల క్రితం గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని నవగమ్ గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు.

Also Read:కామాంధుడైన కన్నతండ్రి.. కూతుళ్లపై లైంకికదాడి.. అది తట్టుకోలేక..

అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళను వివాహం  చేసుకున్నాడు. అప్పటికే ఆమె పెళ్లయి భర్త నుంచి విడిపోయి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ క్రమంలో ఆమె పెరిగి పెద్దదవుతుండటంతో అతని కన్ను బాలికపై పడింది.

ఇంట్లో భార్య లేని సమయంలో సవతి కూతురిపై అత్యాచారానికి పాల్పడేవాడు. రెండేళ్లుగా లైంగిక చర్యకు పాల్పడుతుండటంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే కొద్దిరోజులుగా బిడ్డ ప్రవర్తనలో మార్పు వస్తుండటంతో పాటు బాగా నీరసంగా ఉండటం గమనించిన తల్లి.. కుమార్తెను ఆస్పత్రికి తరలించింది.

Also Read: కన్నకూతురిపైనే అత్యాచారం: తండ్రికి పదేళ్లు జైలు శిక్ష

అక్కడి వైద్యులు బాలికను పరీక్షించగా దిగ్భ్రాంతికర వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఆమె నాలుగు నెలల గర్భవతి అని చెప్పడంతో ఆ తల్లి షాక్‌కు గురైంది. కూతురిని గట్టిగా నిలదీయడంతో బాలిక జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.