Asianet News TeluguAsianet News Telugu

కామాంధుడైన కన్నతండ్రి.. కూతుళ్లపై లైంకికదాడి.. అది తట్టుకోలేక..

తండ్రిపై ద్వేషం పెంచుకున్ను అక్కాచెల్లెళ్లు ముగ్గురు గతేడాది జూలైలో అతడిని హత్య చేశారు. కత్తితో పలుమార్లు దాడి చేసి.. సుత్తితో కొట్టి చంపారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Abused Russian sisters who killed father face murder charge
Author
Hyderabad, First Published Dec 4, 2019, 2:29 PM IST

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కామాంధుడిలా మారిపోయాడు. రక్తం పంచుకుపుట్టిన ముగ్గురు కూతుళ్ల రక్తం పీల్చుకుతినే రాక్షసుడిలా ప్రవర్తించారు. ముగ్గురిని నానా రకాలుగా హింసించి.. ప్రతి రోజూ లైంగికంగా బాధించేవాడు. కాగా... తండ్రి క్రూరత్వం నుంచి బయటపడే మార్గం లేక... ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. కన్న తండ్రిని చంపేశారు. ఈ  సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఈ ఘటన 2018లో చోటుచేసుకోగా..తాజాగా ఈ కేసు న్యాయస్థానం ముందుకు వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...రష్యాకు చెందిన క్రెస్టీనా(20), ఏంజిలీనా(19), మారియా క్యాథరీన్(18) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ తండ్రి మైఖేల్‌తో కలిసి నివసించేవారు. అయితే మైఖేల్‌ ఎల్లప్పుడూ వారిని శారీరంగా హింసిస్తూ.. లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. రష్యాలో గృహహింసకు సంబంధించి ఎటువంటి ప్రత్యేక చట్టం లేకపోవడంతో అతడి ఆగడాలు మరింతగా పెరిగాయి.

ఈ నేపథ్యంలో తండ్రిపై ద్వేషం పెంచుకున్ను అక్కాచెల్లెళ్లు ముగ్గురు గతేడాది జూలైలో అతడిని హత్య చేశారు. కత్తితో పలుమార్లు దాడి చేసి.. సుత్తితో కొట్టి చంపారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సంపాదించినట్లు విచారణ అధికారులు మంగళవారం పేర్కొన్నారు. 

ఈ మేరకు క్రెస్టీనా, ఏంజెలీనాపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వారిద్దరూ ఉద్దేశపూర్వకంగానే తండ్రి మైఖేల్‌ను హత్య చేసినట్లు కోర్టుకు తెలిపారు. అంతేగాక మారియాకు సైక్రియాట్రిస్ట్‌తో చికిత్స అందించాలని సూచించారు. ఈ క్రమంలో క్రెస్టీనా, ఏంజెలీనాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రష్యా చట్టాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆ యువతులు చేసిన పనిలో తప్పేమి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశంలో గృహ హింస చట్టం ఉండి ఉంటే వాళ్లు ఈ నిర్ణయం తీసుకొని ఉండేవారు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మా సిస్టర్స్ ని వదిలేయండి అంటూ అందరూ ప్లకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేయడం గమనార్హం. మరి న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios