వినాయకుడిని చూడటానికి వచ్చిన బాలికపై మండపంలోనే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రంలోని అగర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక గణేశ్ నవరాత్రి కావడంతో స్నేహితురాళ్లతో కలిసి గ్రామంలోని వినాయక విగ్రహాలను చూడటానికి వెళ్లింది.

ఓ చోట బొజ్జ గణపయ్య బాగా నచ్చడంతో అక్కడే స్నేహితురాళ్లతో కలిసి నిల్చొంది. ఈ సమయంలో 24 ఏళ్ల మండపాల కాంట్రాక్టర్ ఆమెకు మాయమాటలు చెప్పి గణేశ్ మండపం వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

అనంతరం తనపై జరిగిన దారుణాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.