చెన్నై: ఏడో తరగతి విద్యార్థిపై  లైంగిక దాడి చేసి విద్యుత్ షాక్‌‌తో హతమార్చిన ఘటన  తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్లు జిల్లా ఉత్తర మధురై సమీపం జీ కురుంపట్టికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని కొన్ని రోజుల క్రితం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

నోటితో కరెంట్ వైరు పట్టుకొని ఒళ్లంతా గాయాలతో  మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాలిక ఇంటికి సమీపంలోని విద్యార్థులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు మృతురాలి బంధువులు అనుమానించారు.

ఇదే ప్రాంతానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థే నిందితుడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు. ఈ  నెల 16వ తేదీన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా చొరబడి లైంగిక దాడికి దిగినట్టుగా నిందితుడు ఒప్పుకొన్నాడు. 

బాధితురాలు ప్రతిఘటించి కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టి లొంగదీసుకొన్నట్టు చెప్పారు.తన ఆనవాళ్లు బయటకు చెప్పుతోందనే భయంతో ఇంట్లో ఉన్న విద్యుత్ వైరును బాలిక నోటిలో ఉంచి కరెంట్‌ షాక్‌కు గురి చేసి హతమార్చానని ఒప్పుకొన్నారు.