అక్కడి వాచ్‌మెన్‌ పురుషోత్తమ్మన్‌ జనాతో ఆ బాలికకు అంతకుముందు పరిచయం ఉండటంతో అతని వద్దకు వెళ్లి ఇంటి నుండి పారిపోయి వచ్చానని తెలిపింది. 

తల్లిదండ్రులపై కోపంతో ఇల్లు వదిలి వచ్చిన బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచాారనికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా నిందితుల్లో ఒకరిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. కాగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై కీల్పాక్‌ ప్రాంతంలో నేపాల్‌కు చెందిన దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమార్తె (15) ఎనిమిదో తరగతి చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. రెండ్రోజుల క్రితం తల్లిదండ్రులపై కోపగించి, ఆ బాలిక ఇంటి నుంచి పారిపోయింది. గతంలో వారు నివసించిన నుంగంబాక్కం రెసిడెన్షియల్‌ ప్లాట్‌ వద్దకు వెళ్లింది. 

అక్కడి వాచ్‌మెన్‌ పురుషోత్తమ్మన్‌ జనాతో ఆ బాలికకు అంతకుముందు పరిచయం ఉండటంతో అతని వద్దకు వెళ్లి ఇంటి నుండి పారిపోయి వచ్చానని తెలిపింది. ఆమెను తన ఇంటి వద్దకు తీసుకెళ్లిన వాచ్‌మెన్‌ నిర్బంధించాడు. అతనితో పాటు మరో ఇద్దరు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడారు. 

కుమార్తె ఆచూకీ కోసం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నుంగంబాక్కంలోని రెసిడెన్షియల్‌ ప్లాట్‌ వద్దకు వెళ్లి తనిఖీ నిర్వహించి, బాలికను గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో పురుషోత్తమ్మన్‌ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.