బాలిక స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమెకు ప్రేమ పేరిట మొదట  ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతని ప్రేమను సదరు బాలిక నిజమని నమ్మింది. ఆమెను అలా నమ్మించి.. అదును చూసుకొని బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

అతనితోపాటు మరో నలుగురు మిత్రులు కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వీరి కారణంగా సదరు బాలిక గర్భం దాల్చింది. అప్పటిదాకా ఈ విషయం బయటకు రాకపోవడం గమనార్హం. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోవైకి చెందిన కట్టడ కార్మికుడి కుమార్తె (15) అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కడుపునొప్పి అని చెప్పడంతో బాలికకు తల్లిదండ్రులు ఆదివారం కోవై ఆసుపత్రిలో చికిత్సకు అనుమతింప చేశారు. డాక్టర్‌లు పరిశోధనలో బాలిక గర్భిణిగా ఉన్నట్టు తెలిసింది. 

దీంతో హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఈ విషయంతెలిసిన బాలిక అక్కడి నుంచి పరారయ్యింది. ఎలాగోలా బాలికను పట్టుకన్న పోలీసులు గర్భం ఎలా దాచావని ప్రశ్నించగా.. అసలు విషయం తెలియజేసింది. ప్రేమ పేరిట దగ్గరై.. తర్వాత నలుగురు యువకులు తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారని సదరు బాలిక చెప్పింది.

తల్లిదండ్రులకు భయపడి ఈ సంగతిని వారికి చెప్పలేదని తరచూ కడుపు నొప్పి రావడంతో తన తల్లితో ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేస్తున్న సమయంలో తాను గర్భిణి అయినట్టు తెలిసిందని విద్యార్థిని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కార్తీక్‌ (23), ధనశేఖర్‌ (24), సింగనల్లూరుకు చెందిన సంతోష్‌ (19), అలాగే ప్లస్‌ వన్, ప్లస్‌టూ చదువుతున్న నలుగురితో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

వారిని కోర్టులో హాజరుపరిచి విద్యార్థులు నలుగురు జువైనల్‌ హోంకు తరలించారు. మిగతా ముగ్గురిని జైలుకు తరలించారు.  ఈ వ్యవహారంలో పోలీసులు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. బాలికను బెదిరించి.. ఇంటికి రప్పించుకొని మరీ లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.