ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ తండ్రి కన్నకూతురినే కాటేశాడు. అత్త దగ్గరపడుకున్న చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లి మరీ అత్యాచారానికి ఒడిగట్టాడు.  

ఉత్తర ప్రదేశ్ : కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి మానవ మృగంలా మారాడు. తల్లిలేని ఆ పసిపాప ఆలనాపాలనా చూడాల్సినవాడే ఆ బంగారు తల్లి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. వావి వరసలు మరిచి అభం, శుభం తెలియని ఆ 12 ఏళ్ల బాలికపై molestationకి పాల్పడ్డాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన uttarpradeshలోని కన్నౌజ్ లో గురుసహాయ్ గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి బాలిక తన అత్త వద్ద నిద్రపోతుండగా.. నిందితుడు ఆమెను బలవంతంగా వేరే గదిలోకి ఎత్తుకెళ్లాడు.

ఆ తర్వాత బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక ఏడుపులు విన్న ఆమె అత్త కేకలు వేయడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు గురు సహాయ్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. పదేళ్ల క్రితమే బాలిక తల్లి చనిపోగా, అప్పటి నుంచి అదృశ్యమైన నిందితుడు నాలుగైదు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు. 

నిరుడు మేలో ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. కడుపున పుట్టిన కూతుర్ని కళ్లలో పెట్టి పెంచుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. పదేళ్ల పసిదని కూడా చూడకుండా అకృత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా తన స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన తమిళనాడులోని టీ నగర్ లో కలకలం రేపింది. స్నేహితులతో కలిసి కన్నకూతురిపైనే సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఆ తండ్రికి న్యాయస్థానం 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతనితో పాటు లైంగికదాడికి పాల్పడిన అతని స్నేహితులకు 40 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 

ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా గోబి సమీప గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెడితే ...గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి, తండ్రి, తమ్ముడితోపాటూ నివసిస్తోంది. కాగా తండ్రి పెట్టే చిత్రహింసలు భరించలేక తల్లి ఎటో వెళ్లిపోయింది. తల్లిలేని పిల్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కీచకతండ్రి 2019లో తన స్నేహితులైన అరుణాచలం (35), మణికంఠన్(33)లతో కలిసి బాలిక మీద సామూహిక లైంగిక దాడికి తెగబడ్డాడు. 

విషయం తెలుసుకున్న స్థానికులు వీరి మీద గోబి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఈ కేసును ఈ రోడ్ జిల్ల మహిళా కోర్టు విచారణ జరిపింది. బుధవారం న్యాయమూర్తి మాలతి ఈ కేసులో తీర్పును వెలువరించారు. ఘాతుకానికి పాల్పడిన బాలిక తండ్రికి మూడు సెక్షన్ల కింద 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే, మిగతా ఇద్దరికీ రెండు సెక్షన్ల కింద 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.