Asianet News TeluguAsianet News Telugu

ఆశారాం బాపూ ఆశ్రమంలో మరో దారుణం?.. అదృశ్యమైన మైనర్ బాలిక మూడు రోజుల తర్వాత ఆశ్రమంలోని కారులో విగతజీవిగా..

ఉత్తరప్రదేశ్‌లో కనిపించకుండా పోయిన ఓ బాలిక మూడు రోజుల తర్వాత విగతజీవిగా కనిపించింది. ఆశారాం బాపూ ఆశ్రమంలో పార్క్ చేసిన ఓ కారులో ఆ బాలిక మృతదేహం లభించింది. పోలీసులు ఆ డెడ్ బాడీని పోస్టుమార్టం చేయడానికి పంపించారు. ఆశ్రమానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

minor girl missing found dead in a car parked in asaram bapu ashram
Author
Lucknow, First Published Apr 8, 2022, 4:42 PM IST

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఈ నెల 5వ తేదీన 13 లేదా 14 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. కానీ, అనూహ్యంగా ఆ బాలిక మృతదేహం ఆశారాం బాపూ ఆశ్రమంలో పార్క్ చేసిన ఓ కారులో కనిపించింది. పోలీసులు ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించడానికి హాస్పిటల్ పంపించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆశారాం బాపూ ఆశ్రమానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఆశారాం బాపూ ఇప్పటికే లైంగికదాడి కేసులో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. జోద్‌పూర్‌లోని ఓ ప్రత్యేక న్యాయస్థానం 2018లో ఆశారాం బాపూను రేప్ కేసులో దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2013లో ఆశారాం బాపూ 16 ఏళ్ల బాలికను రేప్ చేసినట్టుగా నిరూపణ అయింది. దీంతో కోర్టు ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ కేసులో మరో ఇద్దరికి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 2013 నుంచి జైలులో ఉన్న ఆశారాంపై మూడు అత్యాచారం కేసులు నమోదయ్యాయి.  పదహారేళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు ఆయనకు జైలు శిక్ష వింధించింది. తాజాగా, మరోసారి ఓ మైనర్ బాలిక మరణంతో ఆశారాం బాపూ ఆశ్రమం వార్తల్లోకి వచ్చింది.

గతేడాది ఆశారాం బాపూ ఆశ్రమానికి వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అదృశ్యమయ్యాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ శివారు మోతేరాలో ఉణ్న ఈ ఆశ్రమానికి హైదరాబాద్ యువకుడు విజయ్ యాదవ్ తన స్నేహితులతో కలిసి ఈ నెల 3న వెళ్లి అక్కడే బస చేశాడు. ఈ క్రమంలో అతడు 11 తేదీ నుంచి కనిపించడం లేదు. 

దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు సోమవారం ఆ ashramకి వెళ్లి విచారించగా నిర్వాహకుల నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. దీంతో అక్కడి చాంద్ ఖేడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు missing కేసు నమోదు కావడంతో డీసీపీ-2 విజయ్ పాటిల్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది. బాలిక మీద అత్యాచారం కేసులో ఆశారాం బాపూ ప్రస్తుతం రాజస్తాన్ లోని జోధ్ పూర్ జైల్లో ఉన్నారు. 

ఈ నెల 8న విజయ్ యాదవ్ తో పాటు అతడి స్నేహితులు Jodhpur లోని ఆశారాం ఆశ్రమంలో జరిగిన శిబిరానికి హాజరయ్యారు. మిగిలిన వాళ్లు ఈ నెల 10న తిరిగి వచ్చేయగా, తాను మరికొన్ని రోజులుండి వస్తానంటూ విజయ్ అక్కడే ఆగిపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి కుటుంబీకులు అతడికి ఫోన్ చేస్తున్నా స్విచ్ఛాఫ్ అని వస్తోంది. దీంతో ఆందోళనకు గురైన vijay సోదరుడు, ఓ బంధువు మోతేరాకు చేరుకున్నారు. ఆశ్రమం నిర్వాహకులను విజయ్ గురించి ఆరా తీశారు. 

వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో రిజిస్టర్ ను పరిశీలించారు. ఆశ్రమంలోకి వెళ్లినట్టు విజయ్ పేరు నమోదైనా, బయటకు వచ్చినట్లుగా నమోదు కాలేదు. ఆశ్రమంలో ఉన్న cc cameraల ఫీడ్ ను పరిశీలించాలంటూ కుటుంబీకులు కోరగా 11వ తేదీకి సంబంధించిన ఫీడ్ అందుబాటులో లేదంటూ నిర్వాహకులు సమాధానం ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios