కర్నాటక: బెంగళూరులో మైనర్ బాలిక (9) ఆత్మహత్యకు పాల్పడింది. షాపింగ్‌కు తీసుకెళ్లకపోవడంతో బాలిక మనస్తాపానికి గురై బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఈ విద్యార్థిని ఐదో తరగతి చదువుతోంది.
బెంగళూరు: షాపింగ్‌కు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అమ్మాయి(9)ని షాపింగ్‌కు తీసుకెళ్లకపోవడంతో బాలిక మనస్తాపానికి గురైంది. దీంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. కర్నాటకలో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
తల్లిదండ్రులు తనను షాపింగ్ కు తీసుకెళ్లలేదనే కారణంగా మనస్తాపానికి గురై బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటన బెంగళూరులోని చామరాజ్‌పేటలో చోటుచేసుకుంది. మృతురాలు 5వ తరగతి విద్యార్థిని. ఆమె తల్లిదండ్రుల ముగ్గురు పిల్లలలో పెద్దది అని వన్ ఇండియా నివేదించింది. ఆగస్టు 20న ఆమె తండ్రి స్కూల్‌లో పేరెంట్ టీచర్ సమావేశానికి హాజరై ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు.. వారి ఇద్దరు పిల్లలకు బట్టలు కొనడానికి షాపింగ్‌కు వెళ్లారు. బట్టలు కొనడానికి తాను కూడా వస్తానని తల్లిదండ్రులతో చెప్పింది. అయితే, మైనర్ బాలిక కూడా వెంట వెళ్లాలని పట్టుబట్టినా తండ్రి అంగీకరించలేదు. ఆమెను ఇంట్లోనే ఉండమని చెప్పి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. చామరాజ్‌పేట పోలీసులు దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. బాలిక తండ్రి పెయింటర్ కాగా, తల్లి గృహిణి.
మణిపూర్ లో షాకింగ్ ఘటన..
గత ఆరేళ్లుగా తన తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన 15 ఏళ్ల బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయాలపాలై మరణించింది. హిందుస్థాన్ టైమ్స్ నివేదించిన ప్రకారం, బాధితురాలు విషం సేవించింది. దీంతో ఆమె అనేక అవయవాలు పనిచేయకుండా పోవడంతో ప్రాణాలు కోల్పోయింది. చికిత్స కోసం మొదట మైనర్ బాలికను జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(JNIMS) ఇంఫాల్‌లోని జూలై 31న చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో అదే రోజు ఆమెను మరో ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. బాధితురాలు ఆసుపత్రిలో అనేక కిడ్నీ వైఫల్యాల కోసం డయాలసిస్ చేయించుకుంది. ఆ తర్వాత ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(RIMS) ఇంఫాల్‌లో ఆగష్టు 18న ఆమె ఆదివారం రాత్రి 9:40 గంటల ప్రాంతంలో మరణించినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది.
పబ్లిక్ జాయింట్ యాక్షన్ కమిటీ కో-కన్వీనర్ ప్రకారం (JAC) బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. బాధితురాలి తండ్రి గత ఆరేళ్లుగా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది. ఆ తర్వాత మానసిక వేదన భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె మూడు రోజుల పాటు ఎటువంటి చికిత్స లేకుండా ఇంట్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె ఆగస్టు 3న JNIMS ఆసుపత్రిలో చేరిందని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. వైద్యులు ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 305, పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం, 2012లోని సెక్షన్ 6 కింద తౌబాల్‌లోని మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
