తల్లి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ బాలికపై కామాంధుల కన్ను పడింది.  మైనర్ బాలిక అనే కనికరం లేకుండా ఆస్పత్రిలోనే ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ ప్రాంతానికి చెందిన ఓ కరోనా బాధిత మహిళ ఒకరు 20 రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె వెంట కుమార్తె (14)కూడా ఉంటోంది. ఆ బాలికపై కన్నెసిన వార్డుబాయ్‌ మనోజ్‌ పరిచయం పెంచుకుని రోజూ హోటల్‌ నుంచి భోజనం తెచ్చి ఇచ్చేవాడు. శనివారం రాత్రి హోటల్లో తినేసి వద్దామని కారులో బాలికను ఎక్కించుకుని వెళ్లాడు. 

మరో ముగ్గురు యువకులు కూడా కారులో ఉన్నారు. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి బాలికపై నలుగురూ లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక స్పృహ కోల్పోవడంతో మళ్లీ కారులోనే ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనంతరం బాధితురాలు దారుణాన్ని వెల్లడించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.